వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్పులతో వణికిన రాజధాని.. నడిరోడ్డులో ఒక వ్యక్తిని కాల్చి పారిపోయిన దుండగులు ( వీడియో)

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో అందరు చూస్తుండగానే ఓ గ్యాంగ్ కాల్పులు జరిపింది. కాలనీలో ఓవైపు పిల్లలు అడుకుంటుంటే మరోవైపు కారులో వస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అడ్డుకున్నారు. అనంతరం ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. అయితే కారులో ఉన్న వ్యక్తి దిగి పారీపోతున్న మరి వెంటబడి పదిహేను రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. శుక్రవారం రాత్రీ ఈ దారుణం జరిగింది.

 a man was chased and shot numerous times in delhi

మనిష్ అనే వ్యక్తి ఓ పార్టీకి హజరై తన స్నేహితులతో కలిసి తిరిగి ఇంటికి చేరుకుంటున్నాడు. అయితే రాత్రీ ఎనిమిది గంటల సమయంలో ఢిల్లీలోని సెక్టార్ 11 వద్దకు చేరుకోగానే స్విఫ్ట్ కారులో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు మనీష్‌ను అడ్డగించారు. కారు దిగి ఆయనపై సినిమా ఫక్కిలో కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన మనీష్ వారి నుండి తప్పించుకునేందుకు కారు దిగి పరుగెత్తాడు. అయినా కాల్పులు జరిపిన దుండగులు వెంటబడ్డారు. కాగ మనీష్ పై మొత్తం 17 రౌండ్ల కాల్పులు జరిపగా నాలుగు బుల్లెట్లు ఆయనకు తాకినట్టు తెలుస్తోంది.

ఇక ఆ కాలనీలో పిల్లలు ఆడుకుంటున్న సంధర్భంలోనే వారు కాల్పులకు తెగబడ్డారు. దీంతో కాలనీవాసులతోపాటు పిల్లలు సైతం బయపడి ఇంట్లోకి పరుగులు తీశారు. అయితే ఈ కాల్పులు గ్యాంగ్‌వార్‌గా చెబుతున్నారు. ఏదీ ఏమైన అందరు చూస్తుండగానే కాల్పులు జరపడంతో అదికూడ అత్యంత కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ ఉన్న పాంతంలో కాల్పులు జరగడంతో స్థానిక ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ అధారంగా విచారణ చేపట్టారు. ఫక్కిలో కారు డోరు తెరచీ ఆయనపై కాల్పులు జరిపారు.

English summary
in a scene right out of a Bollywood flick, a man was chased a and shot numerous times in Sector 11, Rohini on Friday in a suspected gang rivalry. The victim, Manish, was returning from a party with his friends when they were waylaid by the shooters
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X