lipika mitra somnath bharti domestic violence delhi arvind kejriwal aap సోమనాథ్ భారతి ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ఏఏపీ
కేజ్రీకి మరో చిక్కు: సోమనాథ్ హింసిస్తున్నాడని భార్య
న్యూఢిల్లీ: గృహహింస ఫిర్యాదు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభ్యుడు, ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమనాథ్ భారతికి ఢిల్లీ మహిళా కమిషన్ బుధవారం నోటీసులు జారీ చేసింది. ఏఏపీకి వరుసగా చిక్కులు వస్తున్నాయి.
గృహహింస ఫిర్యాదు నేపథ్యంలో జూన్ 26వ తేదీకల్లా ఈ నోటీసులకు సమాధానం చెప్పాలని సోమనాథ్ భారతిని ఢిల్లీ మహిళా కమిషన్ ఆదేశించింది.
భర్త సోమనాథ్ భారతి తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని ఆయన భార్య లిపికా భారతి బుధవారం ఆరోపించారు. తన పిల్లలకు కూడా ఆయన నుంచి వేధింపులు తప్పడం లేదని ఫిర్యాదు చేశారు. తనకు భర్త నుంచి, అతడి అనయాయుల నుంచి ముప్పు ఉందని ఫిర్యాదు చేశారు.

సోమనాథ్ భార్య బుధవారం తమ వద్దకు వచ్చి ఫిర్యాదు దాఖలు చేశారని ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు బర్ఖాసింగ్ వెల్లడించారు. మూడేళ్ల నుంచి లిపిక ఇక్కడి ద్వారకా ప్రాంతంలో విడిగా కాపురం ఉంటున్నారు.
సోమనాథ్ అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చి వెళ్లేవారు. 2010 నుంచి తాను భర్త చేతిలో హింసతో సతమతమవుతున్నానని, పిల్లలతో కలిసి ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నానని, అతడి నుంచి విడాకులు కోరుకుంటున్నానని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.