వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్వారంటైన్‌లో కలియుగ భీముడు, రోజుకు 40 చపాతీలు, 10 ప్లేట్ల భోజనం ఆరగిస్తూ..

|
Google Oneindia TeluguNews

అవును.. ఓ వలసకూలీ తినే తిండి చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. వీరి తిండి పాడుగాని కానీ ముక్కున వేలేసుకున్నారు. అన్నట్టు అతగాడు.. ఉదయం టిఫిన్‌లో 40 చపాతీలు కానిచ్చేస్తాడు. సాధారణంగా 4 నుంచి 5 చపాతీలు తింటే ఎక్కువ. ఇక లాంచ్ అనుకో.. 10 ప్లేట్ల భోజనం తినంది అతని కడుపు నిండదు. అతగాడికి వండి పెట్టేందుకు సిబ్బంది కూడా అలసిపోతున్నారు.

రాజస్థాన్‌కు చెందిన 23 ఏళ్ల అనూప్ ఓజా అనే వలస కూలీ.. బీహర్‌ వచ్చాడు. బాక్సర్ జిల్లాలో గల మంజ్వారీ క్వారంటైన్ కేంద్రంలో అతనిని ఉంచారు. అందరిలాగే ఉంటే ఫరావాలేదు. కానీ నలభీముడి లాగా తినడంతో సిబ్బంది ఆశ్చర్యపోయారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. 10 మందికి అందజేసే భోజనం ఒక్కరే తింటున్నారని సిబ్బంది చెబుతున్నారు.

A migrant eats 40 rotis, 10 plates of rice a day

ఇటీవల లిట్టి (చికెన్‌తో చేసిన రోస్ట్) 85 వరకు ఓజా లాగించేశాడు. దీంతో వంట చేసే సిబ్బంది నమ్మలేకపోయారు. అంతేకాదు అతను రోజు 40 చపాతీలు తినడంతో.. ఒకరి కోసం రోజుకు అన్నీ చేయలేము బాబోయ్ అంటూ వాపోతున్నారు. అయితే ఓజా తిండి గురించి ... ఎలా బయటకు పొక్కింది అంటే క్వారంటన్ కేంద్రంలోకి వస్తోన్న సరుకులు వెంటనే అయిపోతున్నాయి. దీంతో ఏం జరిగిందోనని ఆరాతీస్తే అసలు విషయం వెలుగుచూసింది.

Recommended Video

Karnataka Restricts Air, Road, Rail Travel From 5 States

అయితే ఓజా క్వారంటైన్ ముగిసిందని.. ఇక ఆహారం నియంత్రిత పద్ధతిలో ఇవ్వొచ్చని తెలిపామని అధికారులు తెలిపారు. అయితే ఓజా వెళ్లేవరకు అడిగిన ఆహారం ఇవ్వాలని కూడా క్వారంటైన్ కేందం మేనేజర్‌ను ఆదేశించామని ఉన్నతాధికారి తెలిపారు.

English summary
23-year-old migrant, who had returned from Rajasthan and was quarantined at the Manjhwari Quarantine Centre in Buxar, was reported to be consuming 40 rotis in the breakfast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X