హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ ప్రలోభాలు: మొబైల్ యాప్‌తో చెక్ పెడుతోన్న కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాల నుంచి కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలను బెంగళూరు నుంచి హైదరాబాద్ తరలించిన విషయం తెలిసిందే.

మొబైల్ యాప్‌తో..

మొబైల్ యాప్‌తో..

గురువారం రాత్రికి రాత్రే ఎమ్మెల్యేలను బస్సులు, కార్లలో హైదరాబాద్‌కు తరలించాయి. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేల ఫోన్‌కాల్స్ సంభాషణలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఓ మొబైల్‌ యాప్‌ను ఉపయోగిస్తుండటం గమనార్హం.

ఫోన్లు తీసుకోకుండానే కట్టడి..

ఫోన్లు తీసుకోకుండానే కట్టడి..

ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు సంప్రదించాలంటే ఫోన్‌ కాల్సే మార్గం. ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలంటే ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్‌ ఈసారి అలా చేయకుండా సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది.

 ఇలా తెలుసుకుంటోంది..

ఇలా తెలుసుకుంటోంది..

కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు తీసేసుకోకుండా వారిని ఒక యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకొమ్మని చెప్పింది. దీని ద్వారా ఎమ్మెల్యేల ఫోన్‌ కాల్‌ సంభాషణలను ఎప్పటికప్పుడు తెలుసుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే బీజేపీ నేతలు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టిన ఫోన్‌కాల్‌ సంభాషణలు కొన్ని మీడియాల్లో ప్రసారమయ్యాయి.

బీజేపీ మంతనాలు, భారీ ఆఫర్లు

బీజేపీ మంతనాలు, భారీ ఆఫర్లు

ఇప్పటికే బీజేపీ నేతలు గాలి జనార్దన్‌ రెడ్డి, ఆయన సోదరులు, శ్రీరాములు.. కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలతో పరోక్షంగా మంతనాలు జరిపినట్లు ఆ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన గౌరిబిదనూరు, పావగడ ఎమ్మెల్యేలు శివశంకరరెడ్డి, వెంకటరమణప్పకు వారి సన్నిహితుల ద్వారా భారీ ఆఫర్లు ఇచ్చేందుకు సిద్దమని తెలిపినట్లు తెలిసింది.

English summary
The Congress has gone on an overdrive to protect its lawmakers sequestered in a luxury resort 60 km from Karnataka capital Bengaluru. But this time, it isn't telling its newly-elected lawmakers to deposit their mobile phones to prevent emissaries from the ruling BJP from reaching out to them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X