
Viral Video: సీసీ కెమెరాలు ఎత్తుకెళ్తున్న దొంగలు.. ఎత్తుకెళ్లింది ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
సాదారణంగా కోతులు ఏం చేస్తాయి.. మనల్ని భయపెట్టి తనకు కావాల్సి తీసుకెళ్తుంది. ముఖ్యంగా ఆహారానికి సంబంధించి మన చేతిలో ఏది ఉంటే అది తీసుకెళ్తుంది. కానీ ఓ కోతి విచిత్రంగా సీసీ కెమెరాలు ఎత్తుకెళ్లింది. ఇందుకు సంబంధంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళనాడు కన్యాకుమారిలోని శెన్బగరామన్పుదూర్లో ప్లైవుడ్ కంపెనీ యజమాని తన దుకాణం పరిసరాలను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు అమర్చారు. కొద్దిరోజులకే సీసీ కెమెరాలు చోరీకి గురయ్యాయి. దొంగల ఆచూకీ తెలుసుకునేందుకు యజమాని ఫుటేజీని చూడగా షాక్‌కు గురయ్యాడు. తన దుకాణంలో అమర్చిన కెమెరాలను ఓ కోతి దొంగిలించిందని ఆశ్చర్యపోయాడు.

కోతి సీసీకెమెరా చోరీ చేసే క్రమంలో కోతి ముఖం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే ఈ కోతి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లింది. ప్రస్తుతం ఈ కోతి సీసీటీవీని దొంగిలించిన వీడియో వైరల్ అవుతోంది. కోతులు ఈ మధ్య మానవ నివాసాలలోకి వచ్చి ఆగం చేస్తున్నాయి. దాడి కూడా చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో వృద్ధురాలి కోతి దాడి చేసింది.

గత వారం సిమ్లాలో ఓ కోతి డబ్బులతో కూడిన బ్యాగును లాక్కొని పారిపోయింది. ఆ బ్యాగులో 75 వేల రూపాయల నగదు ఉంది. ఒక కోతి ఓ వ్యక్తి చేతిలోని నోట్లతో నిండిన బ్యాగ్‌ను లాక్కొని పారిపోయింది. కోతి వెళ్లి బ్యాగ్‌తో డాబా మీద కూర్చుంది. కోతి నుంచి బ్యాగు తిరిగి తీసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇంతలో కోతి బ్యాగ్ తెరిచి డబ్బు మొత్తాన్ని కిందకు విసిరేసింది. ఈ క్రమంలో నాలుగు వేల రూపాయల నోట్లను చించివేసింది.