హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జేబుదొంగ కమిట్‌మెంట్: భార్యకు కిలో బంగారు నగలు..పిల్లలకు ఇంటర్నేషనల్ విద్య!

|
Google Oneindia TeluguNews

చేసేది దొంగతనాలే అయినా తన భార్య పిల్లలను దర్జగా చూసుకుంటున్నాడు ఓ ఘరాన దోంగ.. హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతంలో కిరాయి, భార్య మెడలో కిలోల కొద్ది బంగారం.. లక్షలు పోసి తన సంతానానికి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువులు..దీంతో పాటు పలు చోట్ల ప్లాట్లు , ఇతర ఆస్తులను కూడబెట్టిన ఘరాన దోంగను హైదరాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు.

 పోలీసులకు చిక్కిన ఘరాణ దోంగ

పోలీసులకు చిక్కిన ఘరాణ దోంగ

ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి బతుకుదెరువు కోసం రైల్వే స్టేషన్‌లో ఓ చిన్న వ్యాపారం చేశాడు.. స్టేషన్ సిగరెట్లు , స్వీట్లు అమ్మకాలతో డబ్బులు సరిపోకపోవడంతో మరోమార్గం వైపు మళ్లాడు. డబ్బు సంపాదన కోసం బతుకుదెరువు నిచ్చే.. రైల్వే స్టేషన్లు, ప్రయాణికులనే టార్గెట్ చేసుకున్నాడు.... ఇలా పోలీసులు కళ్లు గప్పి సంవత్సరాలుగా దోంగతనాలు చేస్తూ... లక్షలు కూడపెట్టాడు. ఒకవేళ పోలీసులు పట్టుకుంటే వారిపై దాడి చేసి పారిపోయో ఘరాన దోంగ ఎట్టకేలకు నాంపల్లి రైల్వే పోలీసులకు చిక్కాడు.

దోంగతనాల కోసం ట్రైనింగ్

దోంగతనాల కోసం ట్రైనింగ్

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆలిఘట్ ప్రాంతానికి చెందిన తానేందర్ సింగ్ కుష్వ గత పదిహేను సంవత్సరాల క్రితం పుణేకు వెళ్లి అక్కడి రైల్వే స్టేషన్‌తో పాటు రైళ్లలో స్వీట్లు, ఇతర వస్తువులు విక్రయిస్తుండేవాడు. అయితే ఈ వ్యాపారంలో పెద్దగా డబ్బు సంపాదన లేకపోవడంతో... రైళ్లోనే కొంతమంది పిక్‌పాకెట్ గాళ్లతో తానేందర్‌కు పరిచయం ఏర్పడింది. దీంతో వారివద్ద దోంగతనాలు ఎలా చేయాలో తెలుసుకున్నాడు. అనంతరం పలు రైళ్లలో పిక్ పాకెటింగ్‌కు పాల్పడ్డాడు. ఇలా సికింద్రాబాద్ , పూణే రైళ్లను టార్గెట్ చేశాడు.

నగరంలో విలాసవంతమైన జీవీతం

నగరంలో విలాసవంతమైన జీవీతం

ఇలా 2004 నుండి పలు దోంగతనాలు చేస్తూ... అప్పుడప్పుడు పోలీసులకు పట్టుపడుతూ... తన జీవనాన్ని కోనసాగిస్తున్న తానేందర్‌కు 2009లో రాజస్థాన్‌కు చెందిన మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడ ఉన్నాడు. దీంతో తన మకాంను ముందు వికారాబాద్ ఆ తర్వాత హైదరాబాద్‌కు మార్చాడు. ఇక్కడి నుండే దొంగతనాలు పాల్పడుతున్నాడు. ఇలా ఇప్పటి వరకు తానేందర్ పై సుమారు 400 వరకు కేసులు నమోదయ్యాయి. లక్షల రూపాయల ప్రయాణికుల సొమ్మును దోంగతనం చేశాడు.

పిల్లలు ఇంటర్‌నేషనల్ స్కూళ్లో చదువులు

పిల్లలు ఇంటర్‌నేషనల్ స్కూళ్లో చదువులు

మొత్తం దోంగతనాల్లో సుమారు రెండు కోట్ల రుపాయలు దోచుకున్నట్టు పోలీసులు తెలిపారు. వచ్చిన డబ్బుతో నగరంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే నగరంలోని చందానగర్ మదీనగూడలోని ఓ పార్ట్‌మెంట్‌లో నెలకి ముప్పై వేల రూపాయల కిరాయ చెల్లిస్తున్నాడు. తన భార్యకు సైతం కిలో బంగారు నగలు చేయించాడు. మరోవైపు తన ఇద్దరు పిల్లలకు ప్రతి సంవత్సరం నాలుగు లక్షలు ఖర్చు పెట్టి ఓ ఇంటర్‌నేషనల్ స్కూళ్లో చదివిస్తున్నాడు. దీనికి తోడు నగరంలోని పలు చోట్ల స్వంత ప్లాట్లు కూడ ఉన్నట్టు పోలీసులు వివరించారు. అరెస్ట్ చేసిన అనంతరం 13 లక్షల రూపాయల నగదు మరో 26 లక్షల రూపాయల విలువ చేసే బంగారు అభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

English summary
a most wanted pickpocketer was arrested by nampalli railway police in hyderabad. lacs of rupees recovered from pickpocketer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X