వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లా రాక్షసా ..... చిన్నారి ఏడుస్తుంటే ఏం చేసిందో తెలుసా

|
Google Oneindia TeluguNews

చిన్నారి పదేపదే ఏడుస్తుంటే సముదాయించాల్సిన తల్లి ఆ చిన్నారి పట్ల కర్కశంగా ప్రవర్తించింది. ఆటపాటలతో బుజ్జగించి, అక్కున చేర్చుకోవాల్సిన తల్లి ఏడుస్తున్న చిన్నారి ఏడుపు ఆపేందుకు చెయ్యకూడని పని చేసింది. అభం శుభం తెలియని పసిబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి ప్రాణాల మీదకు తెచ్చింది బీహార్ రాష్ట్రంలో ఒక తల్లి.

గమ్‌, ఫెవిక్విక్‌ వంటి హాని కారక వస్తువులు చిన్నారులకు హాని చేస్తాయని తెలుసుకదా! కానీ కన్నబిడ్డ ఏడుపును ఆపడానికి వాటినేఉపయోగించింది మాతృమూర్తి. ఈ దారుణ ఘటన బిహార్‌లో శనివారం చోటు చేసుకుంది. శోభ అనే మహిళ తన భర్త, ఏడాదిన్నర వయసున్న కుమారుడితో కలిసి ఛాప్రాలో నివాసం ఉంటుంది. తన కొడుకు పదే పదే ఏడుస్తుండటంతో సముదాయించాల్సింది పోయి దారుణానికి ఒడిగట్టింది.

A mothers cruelity .. applied fevicol to his mouth while baby crying

గుక్కపెట్టి ఏడుస్తున్న పిల్లవాడికి ఎత్తుకొని ఊరడించాల్సిన తల్లి ,భర్త ఇంట్లోలేని సమయంలో కుమారుడి పెదాలకు ఫెవిక్విక్‌ పూసింది. దీంతో చిన్నారి నోట్లో నుంచి నురగ వచ్చింది. ఈలోగా ఇంటికి వచ్చిన శోభ భర్త దీన్ని గమనించాడు. ఎందుకిలా నురగ వస్తోందని భార్యను ప్రశ్నించగా ఎంత సముదాయించిన ఏడుస్తూనే ఉన్నాడని అందుకే పెదాలకు గమ్‌ రాశానని చెప్పింది. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రాణాపాయం తప్పింది. శోభపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ ఆ చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చిన తల్లి చేసిన నిర్వాకం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

English summary
The mother was applied fevicol to stop the baby from crying . With this activity makes everyone shocked. she brought the fevicol and applied to his lips . The baby's father found the frezing of the boy and went out of the hospital. Now he is out of danger. The incident took place in Chapra in Bihar state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X