• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అప్పుడే పుట్టిన కొడుకు గుండె చప్పుడును నిలబెట్టడానికి ఒక తల్లి పోరాటం

By Srinivas
|

మమత ఈ మధ్యే తల్లయింది. అందరి తల్లులలాగానే ఆమె కూడా సంతోషంగా, అలాగే భయపడుతూ కూడా ఉంది. కొన్ని నెలలుగా ఆమె కూడా తల్లిగా తన బిడ్డను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని, ఎంతో బాగా ప్రేమించాలని, బిడ్డని రక్షించటానికి శక్తిని కూడదీసుకుంటూ గడిపింది. కానీ ఆమెకి పుట్టిన బిడ్డకి గుండెలో లోపం ఉండటంతో ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఆమె కూడగట్టుకున్న ధైర్యం మొత్తం కరిగిపోయి కన్నీరుగా మారింది.

మే 13న, పండంటి బాబుకు మమత జన్మనిచ్చింది. ఆ మరుసటి రోజు వెంటనే ఆ బాబును ఎన్ ఐసియూలోకి తీసుకెళ్ళారు. బేబీ శ్వాస తీసుకోలేకపోవటంతో శ్వాస కోసం,గుండె పనిచేయటం కోసం వెంటిలేటర్ అమర్చారు.మమతను ప్రతి రెండు గంటలకోసారి ఎన్ఐసియూకి వెళ్ళి తన బాబుకి పాలివ్వమని సూచించారు. బాబు పాలు చాలా తక్కువగా తాగటంతో మమత కన్నీళ్ళతో బయటకి వచ్చేసేది,నర్సు బాబును చూసుకోటానికి పరిగెత్తేది. "నా బిడ్డ ఏడుపును ఆపలేక, నొప్పి భరించలేక చాలా బాధపడేవాడు " అని మమత అన్నారు.

A mother’s struggle to keep her newborn son’s heart beating

కానీ బాబును తిరిగి వెంటిలేటర్ పై పెట్టారు. మమత కొడుక్కి పుట్టుకతో వచ్చే గుండె లోపం ఉంది. దీనికి వెంటనే గుండె ఆపరేషన్ చేయించాలి."డాక్టరుగారు... మా బాబు ఆపరేషన్ చేయటానికి చాలా చిన్నవాడు, కానీ అతని ప్రాణం కాపాడటం కోసం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయాలని మాకు చెప్పారు."

A mother’s struggle to keep her newborn son’s heart beating

మమతకి తన చిన్నిబాబు, ఎలా ఈ సర్జరీ చేయించుకోగలడని భయం పట్టుకుంది. తను ఇంకా తను సరిగ్గా ఎత్తుకోలేదు కూడా.అదొక్కటే ఆమె చింత కాదు ఆమె వెంటనే ఆపరేషన్ కోసం 5 లక్షల రూపాయలు కూడగట్టాలి. హాస్పిటల్ ఖర్చులకే ఇప్పటివరకూ ఉన్నదంతా ఆ కుటుంబం దగ్గర అయిపోయింది. ప్రతిరోజూ ఎన్ ఐసియూ చికిత్సకి 25,000 రూపాయల ఖర్చు అవుతుంది, వారి సేవింగ్స్ అన్నీ అయిపోయాయి.

A mother’s struggle to keep her newborn son’s heart beating

"నా భర్తకి డిటిహెచ్ ఆపరేటర్ గా చిన్న ఉద్యోగం ఉంది, కొన్ని రోజుల్లో లక్షల రూపాయలను అతను సంపాదించలేడు." అని మమత చెప్పారు. ఆమె పేదరికాన్ని చూసి ఆమె మరిది చికిత్స ఆపకుండా ఉండటానికి 1.5లక్షల రూపాయలను అప్పుగా ఇచ్చారు."మా మరిది తన భార్య నగలను కూడా అమ్మి మాకు సాయం చేసారు. కానీ ఇప్పుడు తన వద్ద కూడా ఏమీ లేవు. మాకు వెళ్ళటానికి కూడా ఏ చోటూ లేదు."

A mother’s struggle to keep her newborn son’s heart beating

మమతకి ఏదోఒకరకంగా డబ్బు సమకూరి తన 15రోజుల వయస్సున్న కొడుకు రక్షించబడతాడని ఆశ. తల్లికి తన బిడ్డ జీవితం, నవ్వులే ఈ తల్లి కోరుకునేది.మీరు తన బిడ్డని కాపాడటానికి మమతకి సాయపడాలి అనుకుంటే, ఆమెకి ఉపయోగపడేలా విరాళం ఇవ్వండి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
On the 13th May, a handsome baby boy was put into Mamata’s arms. And the very next day, he was taken away to the NICU. The baby couldn’t breathe and had to be put on a ventilator which would ease his breathing and keep his little heart breathing.Mamata was instructed to go into the NICU every two hours to feed her baby boy. Her child would hardly take in any milk and she would often have to leave as he would burst out crying and the nurse would come rushing in. “It was painful for me to not be able to sooth my child and make him stop crying,” says Mamata.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more