వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉన్నావో భాదితురాలీ ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యేపై హత్యకేసు నమోదు

|
Google Oneindia TeluguNews

ఉన్నావో అత్యాచార భాదితురాలి కారు ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. సంఘటన జరిగిన తర్వాత ప్రాధమిక సమాచారాన్ని బట్టి సాధరణ ప్రమాదంగా ప్రకటించిన పోలీసులు, రాజకీయ నాయకుల ఒత్తిడితో దిగివచ్చారు. మరోవైపు భాదితురాలి తరుఫున బంధువులు ప్రమాదంపై కుట్ర దాగి ఉందని, వారిని హత్య చేసేందుకు ఎమ్మెల్యే కుట్ర పన్నారని ఆరోపణలు చేయడంతో జైల్లో శిక్ష అనుభవిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగర్‌‌పై పోలీసులు హత్య కేసును నమోదు చేశారు.

మరోవైపు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా తల్లితోపాటు భాదితురాలు అసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. కాగా భాదితురాలికి ఎలాంటీ ప్రమాదం లేదని పోలీసులు ప్రకటించిన కొద్ది సేపటికి తీవ్రగాయాలు కావడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు.మెడ భాగంతోపాటు కాళ్లు, చేతులకు విపరీతంగా గాయాలు అయ్యాయని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

A murder case was filed against BJP legislator Kuldeep Sengar

కాగా ప్రమాదానికి ముందే కారులో ఆమేకు రక్షణగా ఉన్న పోలీసులు రాకపోవడంతో పాటు ఎమ్మెల్యే కొడుకుతోపాటు మరికొంత మంది యువకులు తన కూతురిని బెదిరించారని బాదితురాలి తల్లి ఆరోపణలు చేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీతో పాటు ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్‌లు సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు నమోదు చేయక తప్పలేదు.

English summary
A murder case was filed against BJP legislator Kuldeep Sengar after yesterday's accident in Raebareli, in which two women died and a teenagerThe teen's mother said the accident was meant to "eliminate" her daughter and that Kuldeep Sengar was plotting against them from jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X