వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్రిమెంట్‌ ఉంటేనే... ఇంటికి కిరాయి..! 2 నెలల అడ్వాన్స్ మాత్రమే.. కొత్త రెంటల్ రూల్స్

|
Google Oneindia TeluguNews

ఇళ్ల యజమానులకు,కిరాయిదారులకు మధ్య ఉండే హక్కులను పరిరక్షించేందుకు కేంద్రం మరింత కట్టుదిట్టమైన చర్యులు చేపట్టింది. ఇందుకోసం కోత్త చట్టాన్ని తీసుకురాబోతుంది. ఈ నేపథ్యంలోనే ముసాయిదా బిల్లును తాయరు చేసింది. ముసాయిదా బిల్లుపై ప్రజల అభిప్రాయాలతోపాటు ఆయా రాష్ట్రాల అభిప్రాయం కోరుతోంది. అనంతరం పార్లమెంట్‌లో చర్చించి, నూతన చట్టానికి ఆమోద ముద్ర వేయనుంది.

యజమానులు, కిరాయిదారులకు కొత్త నిబంధనలు

యజమానులు, కిరాయిదారులకు కొత్త నిబంధనలు

ఇక కొత్త ముసాయిదా చట్టంలో అటు ఇంటి యజమానులకు ఇటు కిరాయదారులకు ఇబ్బంది కాకుండా పలు నిబంధనలు తేనున్నారు. ఇందులో భాగంగానే అద్దే ఇళ్ల కోసం రెండు నెలలు, కమర్షియల్ అద్దెలకైతే నెల అడ్వాన్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు ఇళ్లు ఖాలీ చేయించాలనుకునే యజమానులు మూడు నెలల ముందుగానే కిరాయదారులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే యజమానులు, కిరాయదారుల మధ్య ఒప్పంద పత్రం లేకుండా కిరాయలు ఇవ్వకూడదనే నిబంధన పెట్టారు. మరోవైపు ఒప్పందం ప్రకారం గడువు తీరాక కూడ అలాగే కొనసాగితే..రెట్టింపు,లేదా మూడు రెట్ల కిరాయను చెల్లించాలనే నిబంధనను ముసాయిదా చట్టంలో చేర్చారు. యజమానులు ఎలాంటీ ఒత్తిడిలు,దౌర్జన్యాలు చేసినా ఇందుకు సంబంధించి నిబంధనలు రూపోందించారు.

రెంట్ వివాదాల కోసం రెంట్ అథారిటి, ట్రిబ్యునళ్లు,

రెంట్ వివాదాల కోసం రెంట్ అథారిటి, ట్రిబ్యునళ్లు,


చట్టాల అమలుతోపాటు , రెంట్ వివాదాలు పరిష్కరించేందుకు గాను కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు.ఇందుకోసం జిల్లా కలెక్టర్‌ను రెంట్ అథారిటిగా నియమిస్తూ ముసాయిదా చట్టంలో పేర్కోన్నారు. రెంట్ అథారితోపాటు, రెంట్ కోర్టులు, ట్రిబ్యునళ్లను సైతం ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం అద్దె ఒప్పందం అమల్లోకి వచ్చిన రెండునెలల్లోపు ఇంటి యజమాని, అద్దెదారులిద్దరూ తమమధ్య కుదిరిన ఒప్పందం గురించి రెంట్‌ అథారిటీకి సమాచారం అందించాలి. వారంలోపు రెంట్‌ అథారిటీ ,యజమానితోపాటు, కిరాయదారుని ఒక ఐడెంటిటి నంబరును ఇస్తుంది.

అందరికి అద్దెలు లభించేవిధంగా చర్యలు

అందరికి అద్దెలు లభించేవిధంగా చర్యలు


ఇక ఇలాంటీ చట్టాలు తేవడం ద్వార పట్టణ ప్రాంతాల్లోకి వలస వచ్చే అసంఘటితరంగ కార్మికులతోపాటు,విద్యార్థులు,వివిధ రంగాల వ్యాపారుస్తులకు ఇళ్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం భావిస్తోంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఒకే అద్దే విధానం ఉండడం మూలన వివాదాలకు తావు ఉండదనే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది.దీనికి తోడు ప్రస్తుతం ఉన్న అద్దే ఇళ్ల చట్టం అటు యజమానులతో పాటు అద్దెదారులను బయపెట్టే విధంగా ఉందనే అభిప్రాయంలో ఉంది.

చట్టం అమలు ఆయా రాష్ట్రాల ఇష్టం

చట్టం అమలు ఆయా రాష్ట్రాల ఇష్టం

ఇక ముసాయిదా చట్టం పై ప్రజల అభిప్రాయాలను తీసుకుంటుంది. దీంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కూడ తీసుకుంటుంది.అయితే ముసాయిదా చట్టంపై అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కొత్త చట్టాన్ని తీసుకురానుంది. అయితే ఈ చట్టాల అమలు ఆయా రాష్ట్రాల ఇష్టాయిష్టలకే వదిలివేయనుంది.

English summary
the Central government is going to introduce new bill to further strengthen the protection of the rights between house owners and tenants. A new drafting bill has been prepared for this purpose. After the bill is enacted, it is being adopted by several states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X