వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కులాన్ని కనిపెట్టే సాఫ్ట్‌వేర్: కొనుక్కోవడానికి ఎగబడుతోన్న పొలిటిషియన్స్..

ఆయా కులాలకు చెందిన ప్రజల వివరాలను అందించే సాఫ్ట్ వేర్ ను ఓ కంపెనీ రూపొందించినట్టుగా తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కులమతాల ప్రాతిపదికన ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయవద్దని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే కులాన్ని సైతం బహిర్గతం చేసే ఓ సాఫ్ట్ వేర్ ను రూపొందించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఎన్నికల సంఘం వెబ్‌సైట్ లో పొందుపరిచిన డేటాను విశ్లేషించి.. ఆయా కులాలకు చెందిన ప్రజల వివరాలను అందించే సాఫ్ట్ వేర్ ను రూపొందించినట్టుగా తెలుస్తోంది. ముంబైలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ దీనికి రూపకల్పన చేసినట్టుగా చెబుతున్నారు.

త్వరలో బృహన్ ముంబై మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి 80 మంది సిట్టింగ్ కార్పొరేటర్లు ఇప్పటికే ఈ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. ఒక్క కుల ప్రాతిపదికన మాత్రమే గాక అడ్రసును బట్టి, ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారన్నది కూడా ఈ సాఫ్ట్ వేర్ వివరాలు అందిస్తుందట.

A new software now in politician hands to know caste

ఆయా వార్డుల్లోని సామాజిక వర్గాల లెక్కలను బేరీజు వేసుకుని తద్వారా రాజకీయ వ్యూహాలను ప్లాన్ చేసుకునేందుకు అక్కడి నేతలు ప్రయత్నిస్తున్నారు. సెర్చబుల్ డేటాబేస్ కన్వర్ట్ చేసే ఈ సాఫ్ట్ వేర్ ఇప్పుడు ముంబై వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా లాంటి రాష్ట్రాల్లోను త్వరలోనే ఎన్నికలు జరగాల్సి ఉండటంతో.. అక్కడి అభ్యర్థులు కూడా ఈ సాఫ్ట్ వేర్ కొనుగోలుకు ఉత్సాహం చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఇలాంటిదేది తమ దృష్టికి రాలేదని స్పష్టం చేసింది.

English summary
A software which identifies the caste now is in the hands of Mumbai Politicians. Its a hot topic among mumbai citizens
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X