చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రజనీకాంత్ మీడియా షాక్: పోయెస్ గార్డెన్ కు పరుగో పరుగు: సినీ స్టార్స్ క్యూ, ఒక్క దెబ్బతో !

శనివారం రజనీకాంత్ విషయంలో ఓ వార్త హల్ చల్ చేసింది. శనివారం రజనీకాంత్ అత్యవసరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారని ఓ వార్త గుప్పు మంది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడుతో సహ దేశ రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో ప్రతి గంటకు ఎదో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ఆయన రాజకీయాల్లోకి వస్తారో ? లేదో ? అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు ఆయన దేశ, విదేశీ వార్తల్లో టాప్ లో నిలిచారు.

<strong>షాక్: రజనీకాంత్ కొత్త స్కెచ్: సీఎం అభ్యర్థిగా'మోనార్క్':జయ, కరుణనే ఢీ కొట్టిన ఐఏఎస్ !</strong>షాక్: రజనీకాంత్ కొత్త స్కెచ్: సీఎం అభ్యర్థిగా'మోనార్క్':జయ, కరుణనే ఢీ కొట్టిన ఐఏఎస్ !

తాజాగా శనివారం రజనీకాంత్ విషయంలో ఓ వార్త హల్ చల్ చేసింది. శనివారం రజనీకాంత్ అత్యవసరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారని ఓ వార్త గుప్పు మంది. అంతే మీడియా ప్రతినిధిలు పోయెస్ గార్డెన్ లోని ఆయన ఇంటి దగ్గర, శ్రీరాఘవేంద్ర కల్యాణమండపం వద్ద మీడియా ప్రతినిధులు క్యూకట్టారు.

ఉదయం నుంచి హడావిడి

ఉదయం నుంచి హడావిడి

శనివారం ఉదయం నుంచి పోయెస్ గార్డెన్ లోని రజనీకాంత్ ఇంటి ముందు హడావిడి మొదలైయ్యింది. ఉదయం నుంచి తమిళ సినీరంగానికి చెందిన అనేక మంది ప్రముఖులు రజనీకాంత్ ను కలిసి మీరు ఎంత త్వరగా రాజకీయాల్లో వస్తే అంత మంచిదని ఆహ్వానించారు.

మీడియా సంస్థ ప్రముఖులు

మీడియా సంస్థ ప్రముఖులు

శనివారం ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ అధినేత రజనీకాంత్ ఇంటికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. రజనీకాంత్ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని దృవీకరించుకున్న తరువాత మీడియా సంస్థ యాజమాన్యం మర్యాదపూర్వకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలుసుకు గుడ్ లక్ చెప్పారని ఆయన సన్నిహితులు తెలిపారు.

సినీ రంగం, మీడియా ప్రముఖులు

సినీ రంగం, మీడియా ప్రముఖులు

శనివారం సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు రజనీకాంత్ ను కలిశారు. వారిలో అన్నాడీఎంకే పార్టీ మాజీ అధికార ప్రతినిధి, బహుబాష నటుడు ఆనందరాజ్ ముందు వరుసలో ఉన్నారు. అదే విధంగా న్యూఢిల్లీ, ముంబై నుంచి వచ్చిన ప్రముఖ జాతీయ మీడియా సంస్థ యాజమానులు రజనీకాంత్ ను కలుసుకుని చర్చించారని ఆయన సన్నిహితులు తెలిపారు.

రజనీకాంత్ సోదరుడి దెబ్బతో !

రజనీకాంత్ సోదరుడి దెబ్బతో !

రజనీకాంత్ రెండు నెలల్లో కొత్త రాజకీయా పార్టీ పెడుతారని ఆయన సోదరుడు సత్యనారాయణ రావ్ గైక్వాడ్ ప్రకటించారు. స్వయంగా రజనీకాంత్ సోదరుడు ఈవిషయం చెప్పడంతో పలు రాజకీయ పార్టీల నాయకులు షాక్ కు గురైనారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో పూర్తి సమాచారం సేకరించడానికి మీడియా సభ్యులు పోటీ పడ్డారు.

రజనీకాంత్ అత్యవసర మీడియా సమావేశం ?

రజనీకాంత్ అత్యవసర మీడియా సమావేశం ?

శనివారం మద్యాహ్నం రజనీకాంత్ అత్యవసరంగా మీడియాతో మాట్లాడుతారని ఓ వార్త గుప్పుమంది. అంతే పోయెస్ గార్డెన్ లోని ఆయన ఇంటి దగ్గర, చెన్నైలోని శ్రీ రాఘవేంద్ర కల్యాణమండపం దగ్గర మీడియా సభ్యులు క్యూకట్టారు. అప్పటికే పోయెస్ గార్డెన్ లోని రజనీకాంత్ ఇంటి వద్ద ఆయన సన్నిహితులు హడావిడి చెయ్యడంతో ఆ వార్తకు బలం చేకూరింది.

అవునా నిజమా చూస్తాను

అవునా నిజమా చూస్తాను

రజనీకాంత్ మీడియా ప్రతినిధి (పీఆర్ వో) అరవింద్ గుణశేఖర్ ను సంప్రధించడానికి మీడియా సభ్యులు పోటీపడ్డారు. ఏమిటి విషయం అంటూ సూపర్ స్టార్ మీడియా ప్రతినిధి అరవింద్ గుణశేఖర్ ఆరా తీశారు. రజనీ సర్ మీడియాతో మాట్లాడుతారని అంటున్నారు, ఎక్కడ ? చెప్పండి ? అని ఆయన్ను ప్రశ్నించారు.

అసలు విషయంతో మీడియాకు షాక్ !

అసలు విషయంతో మీడియాకు షాక్ !

రజనీ సర్ ఈ రోజు ఎలాంటి మీడియా సమావేశం నిర్వహించడం లేదని ఆయన ప్రతినిధి అరవింద్ గుణశేఖర్ అసలు విషయం చెప్పడంతో మీడియా ప్రతినిధులు షాక్ తిన్నారు. రజనీకాంత్ మీడియాతో మాట్లాడటం లేదని, ఇవన్ని పుకార్లు అని తెలుసుని అక్కడి నుంచి వెనుతిరిగారు. అప్పటికే సోషల్ మీడియాలో రజనీకాంత్ అత్యవసర మీడియా సమావేశం అంటూ ఓ వార్త హల్ చల్ చేసింది.

English summary
A news gone viral that Rajini kanth is planning to meet the press. But his spokesperson has refused the said news.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X