వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాగుబోతులకు షాక్, ఆధార్ లింక్ ! పీకలదాక తాగితే డ్రాప్ చెయ్యాలి, సరుకులు ఫ్రీ, జోక్ కాదు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తాగుబోతులకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇవ్వడానికి సిద్దం అయ్యిందని సమాచారం. ఇక ముందు నేరుగా బార్ కు వెళ్లి డబ్బులు ఇచ్చి మద్యం సేవించడానికి అవకాశం లేకుండా పోతుంది. జోబులో డబ్బుతో పాటు ఆధార్ కార్డు పెట్టుకుని వెళ్లి బార్ లో ఇచ్చి మద్యం సేవించాలి. మద్యం కొనుగోలు చెయ్యాలంటే కచ్చితంగా ఆధార్ కార్డు కావాలనే చట్టం తీసుకురావడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్దం అయ్యిందని సమాచారం. పీకలదాక తాగితే వారిని ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యాలని, వారి కుటుంబ సభ్యులకు ఫ్రీగా సరుకులు ఇవ్వాలని ఓ ఎన్ జీఓ సంస్థ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇది జోక్ కాదు, నిజం. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.

బెంగళూరులో లైవ్ బ్యాండ్ అమ్మాయిలు, హైటెక్ వ్యభిచారం, రెచ్చిపో, విటులకు వల!బెంగళూరులో లైవ్ బ్యాండ్ అమ్మాయిలు, హైటెక్ వ్యభిచారం, రెచ్చిపో, విటులకు వల!

మీడియాలో వార్తలు, నవ్వులు !

మీడియాలో వార్తలు, నవ్వులు !

పరిసర ప్రాంతాలు కాపాడటం కోసం ఎన్ జీఓ సంస్థ చేసిన సిఫారసు మేరకు మద్యం కొనుగోలు చెయ్యాలంటే కచ్చితంగా ఆధార్ కార్డు లింక్ చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తున్నదని కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఇలాంటి సిఫారసులు చాల నవ్వు తెప్పిస్తున్నాయని చాల మంది మందు బాబులు అంటున్నారు.

తాగుబోతుల తిక్క చేష్టలు !

తాగుబోతుల తిక్క చేష్టలు !

బాటిల్స్, టెట్రా ప్యాక్ లోని మద్యం సేవించిన చాల మంది తాగుబోతులు వాటిని తీసుకెళ్లి చెరువులు, నదులు, పార్క్ లు, రోడ్లలో విసిరి వేస్తున్నారని ఎన్ జీఓ సంస్థ ఆరోపిస్తోంది. రోడ్ల మీద మందు బాటిల్స్ పగిలిపోవడం వలన ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్ జీఓ సంస్థ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఇలాంటి వాటిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే నివేదిక ఇవ్వాలని సంబంధింత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని సమాచారం.

ఆధార్ కార్డు లింక్ చెయ్యండి

ఆధార్ కార్డు లింక్ చెయ్యండి

కర్ణాటకలోని మంగళూరుకు చెందిన జాతీయ పరిసర సంరక్షణా సంస్థ (ఎన్ జీఓ) మద్యం బాటిల్స్ విసిరివేయడం వలన ఎలాంటి నష్టం జరుగుతున్నది అని సర్వే నిర్వహించింది. ఆసర్వే నివేదికను కర్ణాటక ప్రభుత్వానికి ఇచ్చింది. టెట్రా ప్యాకెట్లు విసిరి వేయడం వలన జరుగుతున్న హానిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ఎన్ జీఓ సంస్థ ప్రభుత్వానికి మనవి చేసింది. ఇదే సమయంలో మద్యం కొనుగోలు చెయ్యాలంటే కచ్చితంగా ఆధార్ కార్డు లింక్ చెయ్యాలని ప్రభుత్వానికి మనవి చేసింది.

పాత బాటిల్స్ లో కొత్త మద్యం

పాత బాటిల్స్ లో కొత్త మద్యం

మద్యం బాటిల్స్ కు ఆధాకర్ కార్డు లింక్ చేసే వాటిని ఎక్కడంటే అక్కడ విసిరి వెయ్యకుండా తాగుబోతులకు సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని, ఆ మద్యం బాటిల్స్ ఎవరెవరు కొనుగోలు చేశారు అనే వివరాలు ప్రభుత్వం దగ్గర ఉంటుందని, పాత మద్యం బాటిల్స్ తీసుకు వచ్చి ఇస్తేనే కొత్త మద్యం బాటిల్స్ ఇస్తామని నియమాలు పెట్టాలని ఎన్ జీఓ సంస్థ ప్రభుత్వానికి సలహా ఇచ్చింది.

మద్యం షాప్ లైసెన్స్ రద్దు

మద్యం షాప్ లైసెన్స్ రద్దు

మద్యం విక్రయించే బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఎవరెవరికి బాటిల్స్ విక్రయించాం అనే వివరాలను కంప్యూటర్లలో పొందుపరచాలని, ఒక వేళ ఆ బాటిల్స్ రోడ్ల మీద కనపడితే ఆ షాపుల యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని, బార్ లైసెన్స్ లు రద్దు చెయ్యాలని ప్రభుత్వానికి ఎన్ జీఓ సంస్థ పనవి చేసింది.

పీకలదాక తాగితే డ్రాప్ చెయ్యాలి !

పీకలదాక తాగితే డ్రాప్ చెయ్యాలి !

పీకలదాక మద్యం సేవించి రోడ్ల పక్కన పడిపోయిన తాగుబోతులను వారి ఇంటి దగ్గర ఎక్సైజ్ శాఖ సిబ్బంది వారి వాహనాల్లో డ్రాప్ చెయ్యాలని ఎన్ జీఓ సంస్థ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. తాగుబోతులు వారు సంపాదించిన డబ్బు మొత్తం మద్యం కొనుగోలు చెయ్యడానికే ఖర్చు పెడితే వారి కుటుంబ సభ్యులకు ఎక్సైజ్ శాఖ ఉచితంగా దినసరి సరకులు అందించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఎన్ జీఓ సంస్థ సిఫారసు లేఖను చూసిన ఎక్సైజ్ షాక్ అధికారులు, సిబ్బంది షాక్ కు గురై జోకులు వేసుకుంటున్నారని తెలిసింది.

English summary
A NGO recommended to make Aadhaar mandatory for purchasing liquor bottle to Karnataka government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X