వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వింగ్ కమాండర్ అభినందన్‌ను చిత్రహింసలకు గురి చేసిన పాక్‌ కమాండర్ హతం

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌‌ను చిత్రహింసలకు గురి చేసిన పాకిస్థాన్ సైనికుడు రెండు రోజుల క్రితం జరిగిన ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు.. ఆగస్టు 17న పాకిస్తాన్ మూకలను భారత్‌లోకి చొరబడేందుకు కుట్రలు చేస్తున్న నేపథ్యంలోనే భారత దళాలు కాల్పులు జరిపాయి. దీంతో ఇరు వర్గాల మధ్య హోరాహోరి కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే అభినందన్‌ను పట్టుకుని చిత్రహింసకు గురిచేసిన పాకిస్థాన్ సైనిక కమాండర్ భారత సైనికులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు.

కాగా గత ఫిబ్రవరి 27న పాకిస్థాన్ యుద్ద విమానాలపై ఎదురు దాడి చేస్తూన్న మిగ్ 21 యుద్ద విమానాన్ని పాకి సైన్యాలు కూల్చివేసిన విషయం తెలిసిందే, దీంతో వింగ్ కమాండర్ వర్థమాన్ పీవోకేలో పాక్ దళాలకు పట్టుపడ్డాడు. ఆయనపై స్థానిక ప్రజలతో పాటు సైనికులు దాడులు చేశారు. దీంతో అభినందన్ కంటికి గాయమైన విషయం తెలిసిందే.. అయితే అభినందన్‌ను విడిపించేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేసిన నేపథ్యంలోనే భారత్ ఒత్తిడికి తలోగ్గిన పాకిస్థాన్ అభినందన్ తమకు పట్టుపడినట్టు ఫోటోలను విడుదల చేసింది. కాగా ఫోటోల్లో అభినందన్‌కు కళ్లకు గంతలు కట్టి ఎదురుగా పాకిస్థాన్ సైనికులు ఉన్న ఫోటోలు పాకిస్థాన్ విడుదల చేసింది. అందులో పీఓకేలో జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్ కమాండో అహ్మాద్ ఖాన్ మృతి చెందాడు.

A Pakistani commando has been killed who tortured of Commander Abhinandan Varthaman

భారత్ ఒత్తిడితో పాటు అంతర్జాతీయ దేశాల ఒత్తిడితో మార్చి 1 రాత్రి సుమారు 9.20 గంటలకు వింగ్ కమాండర్ అభినందన్ వాఘా బోర్డర్ నుంచి భారత గడ్డపైకి ప్రవేశించారు. ఆయనను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. అనంతరం అభినందన్ కు వైద్య పరీక్షలు జరిపింది. మెడికల్ పరీక్షల తర్వాత ఆయనను వాయుసేన హాస్పిటల్ కు మార్చారు.

English summary
A Pakistani commando who was behind the capture and tortured of Commander Abhinandan Varthaman has been killed in firing by Indian forces along the Line of Control.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X