వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలకలం: ఎయిరిండియా విమానంలో రక్తం కక్కుతూ ప్రయాణికుడు మృతి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లాగోస్ నుంచి ముంబై చేరుకున్న విమానంలో ఓ 42ఏళ్ల ప్రయాణికుడు మృతి చెందాడు. ఈ ఘటనతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ విమానాశ్రయాల్లో అసలు తనిఖీలు చేస్తున్నారా? లేదా? అనేది సందేహంగా మారింది. జ్వరంతో ఉన్న వ్యక్తిని ఎలా అనుమతించారన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.

కుప్పకూలిన శిక్షణ విమానం: కెప్టెన్, మహిళా ట్రైనీ మృతికుప్పకూలిన శిక్షణ విమానం: కెప్టెన్, మహిళా ట్రైనీ మృతి

విమానంలో బాధిత ప్రయాణికుడు జ్వరంతో వణుకుతూ ఉన్నాడని ఇతర ప్రయాణికులు చెప్పారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారని తెలిపారు. విమాన సిబ్బంది ఆక్సిజన్ అందించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. కాసేపటికే సదరు ప్రయాణికుడు కిందపడి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

A Passenger dies on board Air India flight

అంతేగాక, మరణానికి ముందు అతని నోటి నుంచి రక్తం కూడా కారిందని వెల్లడించారు. కాగా, ఆ విమానం ఆదివారం ఉదయం 3.40కి ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. సాధారణ కారణాలతోనే ప్రయాణికుడు మరణించాడని ఎయిరిండియా వెల్లడించింది.

జ్వరం ఉందనే విషయం తమకు తెలిసిందని.. లాగోస్ మెడికల్ స్క్రీనింగ్ టీమ్ కూడా ఇదే చెప్పిందని తెలిపారు. జూన్ 13న లాగోస్ నుంచి ముంబై వెళుతున్న ఏఐ1906 విమానంలో ఎక్కాడని, సాధారణ కారణాలతోనే అతడు చనిపోయాడని తెలిపింది.

Recommended Video

Supreme Court - 'Middle Seats On Flights Must Remain Vacant After June 6'

అతడ్ని బతికించేందుకు తమ మెడికల్ సిబ్బంది చాలా ప్రయత్నాలు చేశారని అయితే, అవి ఫలించలేదు. విమానం ల్యాండ్ అయిన తర్వాత అతడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించామని ఎయిరిండియా తెలిపింది. నిబంధనల ప్రకారమే అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపింది.

English summary
A42-year-old passenger on board an Air India flight from Lagos to Mumbai died under unusual circumstances, raising several questions on the checks and thermal screening being conducted at the airports amid the coronavirus pandemic and how a passenger with a fever was allowed to board the flight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X