వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులకు పెన్షన్, కిసాన్ క్రెడిట్ కార్డులు,వడ్డీ లేని రుణాలు.. బీజేపీ మ్యానిఫెస్టోలో రైతులకు పెద్దపీట

|
Google Oneindia TeluguNews

దేశంలో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంకల్ప్ పత్ర్ పేరుతో విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు పెద్ద పీటవేసింది .

<strong>స్ట్రెచర్‌పై పడుకుని ఎన్నికల ప్రచారం .. ఎన్నికల వేళ ఎన్ని కష్టాలురా నాయనా !</strong>స్ట్రెచర్‌పై పడుకుని ఎన్నికల ప్రచారం .. ఎన్నికల వేళ ఎన్ని కష్టాలురా నాయనా !

మేనిఫెస్టోలో రైతాంగం కోసం పలు స్కీమ్ లను ప్రకటించిన బీజేపీ

మేనిఫెస్టోలో రైతాంగం కోసం పలు స్కీమ్ లను ప్రకటించిన బీజేపీ

ఏప్రిల్ 08వ తేదీ కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది . భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింఘ్, సుష్మా స్వరాజ్ వంటి కీలక నేతలు బీజేపీ మేనిఫెస్టో ప్రకటనలో పాల్గొన్నారు. ‘సంకల్ప్ పత్ర్' పేరిట ఈ మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ రైతాంగానికి అండగా వుండే పలు స్కీమ్ లను ప్రకటించింది .

60 ఏళ్ళు దాటిన రైతులకు పెన్షన్ , రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు

60 ఏళ్ళు దాటిన రైతులకు పెన్షన్ , రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు

60 సంవత్సరాలు పైబడిన పేద, మధ్య తరగతి రైతులకు పెన్షన్లు అందిస్తామని ప్రకటించింది . రైతులకు వడ్డీ లేని రుణాలు, రైతు పెట్టుబడి సాయం కొనసాగింపు చేస్తామని , అంతే కాకుండా రైతులకు జీరో పర్సెంట్ క్రెడిట్ కార్డులు అందిస్తామని చెప్పింది . ఐదేళ్ల పాటు వడ్డీ లేకుండా లక్ష రూపాయల కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తామని ప్రకటించి రైతులను ఆకట్టుకునే మేనిఫెస్టోప్రకటించింది .

రైతులకు ఇన్ కం సపోర్ట్ క్రింద 6 వేలు ఇస్తామని ప్రకటన

రైతులకు ఇన్ కం సపోర్ట్ క్రింద 6 వేలు ఇస్తామని ప్రకటన

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా పని చేస్తామని పేర్కొన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ సిస్టమ్ అమలు చేస్తామని చెప్పారు. సాగు నీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తామని , తద్వారా రైతాంగ సాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొంది. అంతే కాకుండా 25 లక్షల కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు చేస్తామని గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. రైతులందరికీ ఇన్ కం సపోర్టు క్రింద రూ. 6వేలు ఇస్తామని తెలిపారు.మొత్తానికి రైతాంగాన్ని ప్రసన్నం చేసుకోవటం లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో రూపొందించింది .

English summary
The Bharatiya Janata Party (BJP) on Monday released its election manifesto for the Lok Sabha polls with a promise to provide pension for small and marginal farmers to ensure social security after 60 years of age and they will provide kisan credit cards and also 6 thousand rupees as income support scheme .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X