బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చీ: బెంగళూరులో న్యూఇయర్ పార్టీ, కమిషనర్ భార్యతో 15 మంది ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: నూతన సంవత్సరం వేడుకల సందర్బంగా బెంగళూరు నగరంలో అక్కడక్కడ యువతులపై జరిగిన కొన్ని అరాచకాల కారణంగా దేశం మొత్తం దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే . అయితే కర్ణాటక టెన్నీస్ అసోసియేషన్ క్లబ్ లో జరిగిన న్యూఇయర్ పార్టీలో ఉన్నతాధికారి భార్యకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆలస్యంగా వెలుగు చూసింది.

బెంగళూరు నగరంలోని డీజీపీ కేంద్ర కార్యాలయానికి కూతవేటు దూరంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అదాయ పన్ను (ఐటీ) శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉద్యోగం చేస్తున్న అధికారి తన భార్యతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి నగరంలోని కర్ణాటక టెన్నీస్ అసోసియేషన్ క్లబ్ లో జరుగుతున్న పార్టీకి వెళ్లారు.

ఇద్దరూ ఓ చోట కుర్చుని నూతన సంవత్సర వేడుకలు ఎంజాయ్ చేశారు. తరువాత టేబుల్ దగ్గరే కుర్చుని ఉండాలని భార్యకు చెప్పి ఆ అధికారి సమీపంలో ఉన్న భోజనం ప్లేట్ లో పెట్టుకురావడానికి వెళ్లారు. ఆ సమయంలో 15 మంది అసిస్టెంట్ కమిషనర్ భార్య దగ్గరకు వెళ్లారు.

A person has been arrested by Bengaluru police for misbehaving with wife of Assistant Commissioner in IT department

తరువాత ఆమె దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకోవాలని చెప్పి ఆమె శరీరం మీద చేతులు వేసి అసభ్యంగా ప్రవర్థించారు. అంతే కాకుండా ఆమెను పురుషపదజాలంతో ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టి వేదింపులకు గురిచేసి ఆమె పట్ల దురుసుగా ప్రవర్థించారు.

తరువాత ఆమె జరిగిన విషయాన్ని భర్తకు చెప్పారు. ఐటీ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఫిర్యాదు చెయ్యడంతో కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు టెన్నీస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించి 15 మంది మీద కేసు నమోదు చేశారు.

ఒక కమాంధుడిని గుర్తించి అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. ప్రసిద్ధి చెందిన టెన్నీస్ అసోసియేషన్ క్లబ్ లో ఈ దారుణం జరగడంతో పోలీసు అధికారులు సీనియస్ అయ్యారు. ఐటీ శాఖ అధికారి భార్యతో అసభ్యంగా ప్రవర్థించిన వారినెవ్వరినీ వదిలి పెట్టమని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
A person has been arrested by Bengaluru police for misbehaving with wife of Assistant Commissioner in Income Tax department. The incident happened on 1st January at Tennis Association. It is alleged that 15 people misbehaved with the lady.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X