సుకేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ - ఫొటోలు లీక్ : ఈడీ ఉచ్చులో చిక్కుకున్నట్లేనా..!!
మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు వారి చేతులకు చిక్కారు. రూ. 200 కోట్ల దోపిడీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నసుకేష్ చంద్రశేఖర్‌తో సంబంధాలను జాక్వెలిన్ ఖండించారు. తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇది జరిగిన కొద్ది వారాలకు ఇప్పుడు ఒక వివాదాస్పద ఫొటో బయటకు వచ్చింది. సుకేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కలిసి ఉన్న ఫొటోల బయట పడింది. సుకేష్ చంద్రశేఖర్ మధ్యంతర బెయిల్ పైన విడుదలయిన సమయంలో ఏప్రిల్ - జూన్ కాలంలో ఈ ఫొటో తీసినట్లుగా చెబుతున్నారు.

ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ
సుకేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను చెన్నైలో దాదాపు నాలుగు సార్లు కలిశారని, ఈ సమావేశాల కోసం ఆమె కోసం ప్రైవేట్ జెట్‌ను కూడా ఏర్పాటు చేశారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది నెలల క్రితం మనీ లాండరింగ్ కేసులో జాక్వలిన్‌కు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. అయితే, మూడు సార్లు విచారణకు హాజరు కాని జాక్వలిన్ ఆ తరువాత హాజరయ్యారు. చంద్రశేఖర్ పై 200కోట్ల కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. సుఖేష్ చంద్రశేఖర్, ఆయన భార్య లీనా పౌల్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే బాలీవుడ్ నటి నోరాఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈడీ అధికారులు నోటీసులు పంపారు.

బెయిల్ పైన వచ్చిన సమయంలో ఇలా ఫొటో
కాగా ఈ కేసులో ఇప్పటికే ఈడీ.. ఆమె వాంగ్మూలాన్ని ఆగస్టు 30వ తేదీన నమోదు చేసుకుంది. నాటి నుంచి ఫెర్నాండెజ్ విచారణకు హాజరుకావడం లేదు. ఈ మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే సుఖేష్ చంద్రశేఖర్, లీనా పౌలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ వ్యాపార వేత్త శివేందర్ సింగ్ భార్య అథితి సింగ్ ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు బయటకు వచ్చిన ఫొటో హాట్ టాపిక్ గా మారుతోంది. అద్దానికి ఎదురుగా సెల్ఫీ తీసుకుంటుండగా సుకేష్ చంద్రశేఖర్ నటుడి బుగ్గపై ముద్దు పెట్టుకున్నట్లు ఫోటోలో ఉంది. ఐఫోన్ 12 ప్రో, ఇజ్రాయెల్ సిమ్ కార్డ్‌ని ఉపయోగించి సుఖేష్ చంద్రశేఖర్ స్కామ్‌కు పాల్పడ్డాడు.

200 కోట్ల రూపాయాల దోపిడి కేసులో నిందితుడుగా
సుకేష్ జైలులో ఉన్నప్పుడు కూడా అదే మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. సుకేష్ చంద్రశేఖర్ మరియు మరో 13 మంది రూ. 200 కోట్ల మేర మోసం చేశారని ఢిల్లీ పోలీసులు చార్జిషీట్లో ఆరోపించారు. తన భర్తను జైలు నుంచి విడుదల చేయిస్తానని చెప్పి చంద్రశేఖర్ రూ.200 కోట్లు దోపిడీ చేసినట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. ఈ ఫొటొ లీక్ పైన స్పందించిన సుకేష్ చంద్రశేఖర్ తరపు న్యాయవాది అనంత్ మాలిక్ "జాక్వెలిన్ మరియు సుకేష్ డేటింగ్ చేస్తున్నారు..హార్స్ మౌత్ నుంచి చెబుతున్న అంశాలు" అని చెప్పారు.

విచారణకు సహకరిస్తున్నానంటున్న జాక్వలిన్
ఈ
ఆరోపణల
పైన
నటి
జాక్వెలిన్
ఫెర్నాండెజ్
ప్రతినిధి
ఒక
ప్రకటన
విడుదల
చేశారు.
సాక్షిగా
వాంగ్మూలం
ఇవ్వడానికి
జాక్వెలిన్
ఫెర్నాండెజ్‌ను
ఈడీ
పిలుస్తోందని...ఆమె
తన
వాంగ్మూలాలను
సక్రమంగా
ఇచ్చారని...
భవిష్యత్
లోనూ
ఇదే
విధంగా
విచారణకు
సహకరిస్తారని
వెల్లించారు.
తన
సంబంధాల
గురించి
చేస్తున్న
ఆరోపణలను
జాక్వలిన్
ఖండిస్తున్నట్లు
ఆ
ప్రకటనలో
పేర్కొన్నారు.