వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేరస్థునితో ఇన్‌స్పెక్టర్ సెల్ఫీ...! ఫలితం అనుభవించాడు

|
Google Oneindia TeluguNews

పోలీసులంటే నేరగాళ్లకు ,సంఘవ్యతిరేక శక్తులకు హడల్ ఎత్తాలి. నేరాలు చేసినవారు లేదా ఆరోపణలు ఎదుర్కోంటున్నవారు ఎంత పెద్ద రాజకీయ నాయకులైన, లేదా సెలబ్రెటిలు అయినా.. వారిని నేరగాళ్లుగానే చూడాల్సి ఉంటుంది. కాని ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఇందుకు విరుద్దంగా వ్వహరించారు. సెల్ఫీ మోజులో పడి ఉద్యోగ ధర్మాన్ని మరిచారు. హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న ఓ నాయకున్ని తానే స్వయంగా ఆరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న సంధర్భంలో పక్కనే కూర్చుని నిందితునితో సెల్ఫీ దిగాడు. అంతే కాకుండా దాన్ని సోషల్ మీడీయాలో పోస్ట్ చేశాడు. దీంతో ఫోటో వైరల్ కావడంతో ఇన్‌స్పెక్టర్‌ను జిల్లా ఉన్నతాధికారులు ట్రాన్స్‌ఫర్ చేశారు.

వివరాల్లోకి వెళితే ఓడిశా రాష్ట్రంలోని పూరీకి సమీపంలోని ఆస్ట్రాంగా అనే ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఉన్న శతృత్వంతో మున్నా అనే వ్యక్తి ఓ తండ్రిముందే తన కొడుకును ఆక్టోబర్ 5న హత్య చేశాడు. దీంతో మున్నాను స్థానిక చంద్రబంగా పోలీస్ స్టేషన్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ బాలు ముండా అరెస్ట్ చేశాడు. అనంతరం తన పోలీసు వాహనంలో తీసుకుని స్టేషన్‌కు బయలుదేరాడు.

A Police Inspector took a selfie with a murder accused and transferred

నిందితున్ని ఇద్దరి మధ్యలో కర్చోపెట్టుకున్న అనంతరం ఇన్‌స్పెక్టర్ ముండా, నిందితునితో ఓ సెల్ఫీ తీసుకున్నాడు. కాగా సెల్ఫీ తీసుకున్న సమయంలో నిందితుడు మున్నా టిప్పుటాప్‌గా ఉన్నాడు. కళ్లకు గ్లాస్‌పెట్టుకుని దర్జాగా ఫోజిచ్చాడు. ఇక సెల్ఫీ తీసుకున్న ఫోటోను అరెస్ట్ చేశామని చెప్పుకోవడానికో లేక మున్నా మీద అభిమానంతో తెలియదు కాని ఆ ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

దీంతో హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తితో ఓ ఇన్‌స్పెక్టర్‌ సెల్ఫీ తీసుకోవడం సోషల్ మీడీయాలో వైరల్‌గా మారింది. మరోవైపు నిందితునికి బేడీలు కూడ లేకుండా స్టేషన్‌కు తీసుకురావడం కూడ అనేక విమర్శలు తెరలేపింది. దీంతో విచారణ జరిపిన జిల్లా ఎస్పీ ఇన్‌స్పెక్టర్‌ బాలు ముండాను జిల్లా పోలీస్ కార్యాలయానికి ట్రాన్స్‌ఫర్ చేశారు.

English summary
A Police Inspector took a selfie with a murder accused earned a policeman in Odisha and tranfered to Puri district police headquarters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X