• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లవ్ మ్యారేజ్, భర్త మాయం, కేసు పెట్టిన భార్యకు పోలీసు వల, అర్దరాత్రి రాసలీలు, రెడ్ హ్యాండెడ్ గా తాళం

|

చెన్నై/ తిరుచ్చి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కనపడటం లేదని ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లిన మహిళకు మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకుని అక్రమ సంబంధం సాగిస్తున్న పోలీసును స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డ్యూటీకి నామం పెట్టి అర్దరాత్రి పరాయి మహిళ ఇంటిలో రాసలీలలు సాగిస్తూ పోలీసు శాఖ పరువు తీసిన సదరు పోలీసును సస్పెండ్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

ప్రాణం తీసిన అక్రమ సంబంధం, కాల్చి బూడిద చేసిన ప్రియురాలు, నేను సరిపోనా ? ఎంత మంది !

 లవ్ మ్యారేజ్

లవ్ మ్యారేజ్

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తురైయూర్ పులివలానికి చెందిన సంతోష్ (25), లక్ష్మి (27) ప్రేమించుకున్నారు. తన కంటే రెండు సంత్సరాల ఎక్కువ వయసు ఉన్న లక్ష్మీని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని సంతోష్ ఇంటిలో చెప్పాడు. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో సంతోష్ వారిని ఎదిరించి లక్ష్మీని వివాహం చేసుకున్నాడు.

 ఉద్యోగం కోసం వెళ్లి మాయం

ఉద్యోగం కోసం వెళ్లి మాయం

నాలుగు నెలల క్రితం తాను చెన్నెల్లో ఉద్యోగం వెతుక్కోవడానికి వెలుతున్నానని, ఉద్యోగం వచ్చిన వెంటనే నిన్ను పిలుచుకుని వెలుతానని భార్య లక్ష్మీకి చెప్పిన సంతోష్ ఇంటి నుంచి వెళ్లాడు. ఇంటి నుంచి వెళ్లిన సంతోష్ ఆచూకి మాత్రం లక్ష్మీకి తెలియకపోవడంతో ఆమె ఆందోళన చెందింది.

కేసు పెట్టిన భార్యకు వల

కేసు పెట్టిన భార్యకు వల

తన భర్త సంతోష్ చెన్నై వెళ్లి తరువాత తిరిగిరాలేదని, ఆయన ఆచూకి చెప్పాలని లక్ష్మీ స్థానిక తురయూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీసులు సంతోష్ మాయం అయ్యాడని కేసు నమోదు చేశారు. అదే పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న రామర్ (43) భర్త సంతోష్ కనపడటం లేదని ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లిన లక్ష్మీ మీద కన్ను వేశాడు.

 అక్రమ సంబంధం

అక్రమ సంబంధం

నీ భర్త సంతోష్ ను వెతికిపెడుతానని రామర్ లక్ష్మీని నమ్మించాడు. విచారణ నెపంతో రామర్ నిత్యం లక్ష్మీ ఇంటికి వెళ్లి ఆమెకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. తరువాత లక్ష్మీతో అక్రమ సంబంధం సాగిస్తున్న రామర్ ఎప్పుడు పడితే అప్పుడు ఆమె ఇంటికి వెళ్లి రాసలీలలు సాగించడం మొదలు పెట్టాడు. రామర్ నిత్యం పదేపదే లక్ష్మీ ఇంటికి వచ్చి వెతుతున్న విషయం స్థానికులు గుర్తించారు.

 రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్థానికులు

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్థానికులు

అర్దరాత్రి రామర్ లక్ష్మీ ఇంటికి వెళ్లాడు. తరువాత ప్రియురాలు లక్ష్మీతో రామర్ రాసలీలలు సాగించాడు. రామర్, లక్ష్మీ వ్యవహారంతో తమకు చెడ్డపేరు వస్తుందని ఆందోళనతో స్థానికులు వారు ఉన్న ఇంటికి బయట తాళం వేసి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ ముత్తుస్వామి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి బయట తాళం తీశారు.

ఉద్యోగం ఊడింది

ఉద్యోగం ఊడింది

ఇంటిలో లక్ష్మీతో కలిసి ఉన్న రామర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎస్ఐ ముత్తుస్వామి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.భర్త కనపడటం లేదని ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లిన మహిళకు మాయమాటలు చెప్పి ఆమెతో అక్రమ సంబంధం సాగిస్తూ పోలీసు శాఖ పరువు తీసిన కానిస్టేబుల్ రామర్ ను సస్పెండ్ చేసి విచారణ చేస్తున్నామని తిరుచ్చి జిల్లా ఎస్పీ మీడియాకు చెప్పారు.

English summary
A policeman suspended due to his illegal activities near Thuraiyur in Trichy in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X