అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో పోర్న్ వీడియో ప్రత్యక్షం... ఖంగుతిన్న మహిళ అధికారిణి
రాజస్థాన్‌లో అనుకోని సంఘటన అధికారులను షాక్‌కు గురిచేసింది. అది కూడ ఓ మహిళ ఉన్నతాధికారి అధ్వర్యంలో డిపార్ట్మెంట్ సమీక్ష జరుగుతున్నప్పుడు ,రాష్ట్ర్ర వ్యాప్తంగా పలు జిల్లాల అధికారులు చూస్తుండంగా సమీక్షలో భాగంగా నిర్వహింస్తున్న వీడీయో కాన్ఫరెన్స్ లో ఓ పోర్న్ వీడియో ప్రత్యక్షమయింది. దీంతో మహిళా సెక్రటరీ తోపాటు సమీక్షలో పాల్గోన్న అధికారులు ఖంగు తిన్నారు.
పథకాలకు బదులు పోర్న్ వీడియో...
మంగళవారం మధ్యహ్నాం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో, ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో వివిధ పథకాల, అమలుపై రాష్ట్ర్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల అధికారులతో సివిల్ సప్లై సెక్రటరీ ముగ్ధా సింగ్ వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఆ వీడియో కాన్ఫరెన్స్‌లో ఒక్కసారిగా పోర్న్ వీడియో ప్రత్యక్షమయింది.
రెండు నిమిషాల పాటు హల్చల్ చేసిన పోర్న్ వీడియో..
ఆ వీడీయో రెండు నిమిషాల పాటు ప్లే అయింది. దీంతో అధికారులు ఖంగు తిన్నారు. అయితే వీడియో ప్లే అవుతున్న నేపథ్యంలో టెక్నికల్ అధికారులు హడవుడి పడ్డారు. దీంతో ఆ వీడియో నిలువరించే వరకే రెండు నిమిషాల సమయం పట్టింది. దీంతో ఆ రెండు నిమిషాల సమయం కూడ అధికారుల్లో అయోమయానికి గురయ్యారు. అది కూడ మహిళ అధికారి సెక్రటరీగా ఉన్న సమీక్షలో జరగడంతో ఆమే ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్నారు.
పోర్న్ వీడియోపై ఫైర్ అయిన మహిళ సెక్రటరీ..
కాగా వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మధ్యలో వచ్చిన పోర్న్ వీడీయో సంఘటన పై సివిల్ సప్లై సెక్రటరీ ముగ్ధా సింగ్ విచారణకు అదేశించారు.దీనిపై నేషనల్ ఇన్మామాటిక్ సెంటర్ డైరక్టర్‌ను దీనిపై పై పూర్తి నివేదిక అందించాలని అదేశించారు. ఇక ఇందుకు కారణమైన వారిపై చర్యలు చేపడతామని ఆమే తెలిపారు.