ఎస్కేప్: ఎమ్మెల్యే ఇంటి దగ్గర బాంబు పేలుడు
ఇంపాల్: మణిపూర్ లో ఓ శాసన సభ్యుడి ఇంటి గేటు దగ్గర బాంబు పేలుడు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ శాసన సభ్యుడిని అంతం చెయ్యడానికి ప్రయత్నించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
మణిపూర్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో కెయిరో నియోజక వర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన కరం తామర్ జిత్ సింగ్ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన నివాసం ఉంటున్న ఇంటికి అతి సమీపంలో బుధవారం శక్తి వంతమైన బాంబు అమర్చి పేల్చి వేశారు.

ఆ సందర్బంలో కరం తామర్ జిత్ సింగ్ తో పాటు ఎవ్వరూ అటు వైపు వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు. ఈ బాంబు పేలుడులో ఎవ్వరూ గాయపడలేదని పోలీసు అధికారులు అన్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకుని బాంబులు పెట్టారా, రాజకీయ కక్షలు ఉన్నాయా, తీవ్రవాదులు ఈ దాడికి ప్రయత్నించారా అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత చర్యగా శాసన సభ్యుడి ఇంటి దగ్గర గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications