వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్సూరెన్స్ కొసం హత్య చేయించుకున్న విషాదం..!

|
Google Oneindia TeluguNews

అప్పులు ఎక్కువ కావడంతో అవి తీర్చేందుకు ఓ వ్యక్తి తనను తానే చంపుకున్నాడు. చంపుకోవడమే అంటే ఆత్మహత్య చేసుకోవడం కిరాయి హంతకులను నియమించుకుని హత్య చేయమని చెప్పాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆత్మహత్య చేసుకుంటే ఇన్సూరెన్స్ రాదని భావించిన వ్యక్తి హత్యకు గురై మరణించిన సంఘటన రాజస్థాన్‌లో జరిగింది.

అలర్ట్.. అలర్ట్.. జేఎంబీ ఉగ్రవాది అసదుల్లా షేక్ అరెస్ట్అలర్ట్.. అలర్ట్.. జేఎంబీ ఉగ్రవాది అసదుల్లా షేక్ అరెస్ట్

ఇన్సూరెన్స్ కోసం దారుణం

ఇన్సూరెన్స్ కోసం దారుణం

వ్యక్తి ఆప్పులు అయ్యాయి.ఇతరుల దగ్గర అధిక వడ్డీలకు తెచ్చి వ్యాపారం చేశాడు. కాని అందులో లాభాలు రాకపోగ నష్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలనే ఆ వ్యక్తికి 20 లక్షల రుపాయల అప్పు కావడంతో అప్పు ఇచ్చిన వారు ఇబ్బందులకు గురి చేశారు. దీంతో చేసేది ఏమి లేక చావే శరణ్యంగా భావించాడు. అయితే తాను ఆత్మహత్య చేసుకుంటే భార్య పిల్లలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందనే ఆందోళన చెందాడు. దీంతో ఆయన ఓ ప్రణాళికను సిద్దం చేశాడు. రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ ఆయన ఉంది. దీంతో తాను ఆత్మహత్యకు చేసుకునే బదులు హత్యకు గురైతే ఇన్యూరెన్స్ డబ్బులు వస్తాయని భావించాడు. దీంతో అటు చేసిన అప్పులు తీర్చడంతో పాటు కుటుంభ సభ్యులు కూడ సంతోషంగా ఉంటారనే అభిప్రాయానికి వచ్చాడు.

గొంతుకోసి హత్య

గొంతుకోసి హత్య

ఈ నేపథ్యంలోనే 50 లక్షల రుపాయాల ఇన్సూరెన్స్‌కు గాను అప్పటికే ఎనిమిది లక్షల రూపాలయను చెల్లించాడు.ఇక తాను చనిపోయేందుకు సిద్దమైన బల్బీర్ తనను చంపేందుకు ఇద్దరు వ్యక్తులకు కాంట్రాక్టు ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను వారం రోజుల క్రితం బల్బీర్‌ను వ్యక్తిని గొంతుకోసి చంపారు. అనంతరం కాళ్లు చేతులను వైర్లతో కట్టి బిల్వారా జిల్లాలోని మాంగ్రోప్ అనే గ్రామంలో పడేశారు. దీంతో సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బల్బీర్ కుటుంభసభ్యులకు సమాచారం ఇచ్చారు.

 చంపేందుకు 80 వేల సుపారీ

చంపేందుకు 80 వేల సుపారీ

అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. విచారణలో బాగంగా బల్బీర్‌‌ను హత్య చేసిన వారిని పోలీసులు కొద్ది రోజుల్లోనే పట్టుకన్నారు. పోలీసులు అసలు తమ స్టైల్లో విచారణ జరపడంతో అసలు విషయం బయటికి వచ్చింది. తామే హత్య చేసినట్టు ఒప్పుకున్నారు..ఇందుకోసం తమకు ఎనబై వేల రుపాయలు కూడ ఇచ్చినట్టు అంగీకరించారు.. అయితే బల్బీర్ కుటుంభ సభ్యులు మాత్రం ఇన్సూరెన్స్ గురించి కాని, హత్యగురించి తెలియదని తెలిపారు.కాగా బల్బీర్ ఆశీంచినట్టుగా అటు ఇన్సూరెన్స్ డబ్బలు రాకపోగా తనువు మాత్రం చాలించాడు.

English summary
A Rajasthan man gave a contract to get himself murdered.police have claimed that man plotted his own murder.He allegedly planned the murder so that his family could claim the Rs 50 lakh insurance that was in his name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X