వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ జరిగిందంటే... అందుకు కారణం నువ్వేనంటూ యువతిని గుండు గీసీ, ఊరేగించిన పంచాయితీ పెద్దలు

|
Google Oneindia TeluguNews

ఇటివల గ్రామపంచాయితీల్లో న్యాయం కోసం వెళితే భాదితులనే బహిరంగంగా శిక్షిస్తున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. తమకు అన్యాయం జరిగింది మోర్రో అంటూ పెద్ద మనుష్యులకు చెప్పుకున్న ప్రయోజనం లేకుండా పోతుంది. ఈనేపథ్యంలోనే ఇటివల ఓ గ్రామంలో గ్రామ పంచాయితీ పెద్దలే బాలికను విపరీతంగా కాళ్లతో తన్ని గాయాలపాలు చేసిన ఘటన మరవక ముందే మరో సంఘటన బీహార్‌లోని గయా ప్రాంతంలో చోటుసుకుంది. అత్యాచారం జరిగిందని పంచాయితీవెళితే దానికి కారణం నువ్వే అంటూ యువతి వెట్రుకలు కత్తిరించి ఊరంతా తప్పిన అమానావీయ ఘటన చోటుచేసుకుంది.

మత్తుమందు ఇచ్చి ఆరుగురు యువకులు అత్యాచారం

మత్తుమందు ఇచ్చి ఆరుగురు యువకులు అత్యాచారం

అత్యాచారాలకు గురైన మహిళలకు రక్షణగా ఉండాల్సిన గ్రామ పెద్దలే అందుకు కారణం నువ్వే అంటూ ఓ మైనర్ బాలికపైను శిక్షించారు గ్రామ పెద్దలు..వివరాల్లోకి వెళితే బీహార్‌ గయా జిల్లాలోని కాప్ గ్రామంలో ఓ మైనర్ బాలికను ఆరుగురు యువకులు బలవంతంగా అత్యాచారం చేశారు. ఆగస్టు 14న బయటకు వెళ్లిన ఓబాలికకు మత్తు మందు జల్లి తమ వాహనంలో తీసుకువెళ్లిన యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న యువతిని తన బంధువుల ఇంట్లో వదిలిపెట్టి వెళ్లారు. దీంతో జరిగిన విషయాన్ని తెలుసుకున్న యువతి ఈ దారుణానికి పాల్పడిన వారిని గుర్తించింది.

వెంట్రుకలు కత్తిరించి ఊరేగింపు...

వెంట్రుకలు కత్తిరించి ఊరేగింపు...

అనంతరం గ్రామంలోని పంచాయితీ పెద్దలకు ఫిర్యాధు చేసింది. కాని పంచాయితీ పెద్దల్లో ఆమేకు అనుకోని తీర్పు వెలువడింది. బాధితురాలికి అండగా ఉండాల్సిన పంచాయితీ పెద్దలు అనూహ్యమైన తీర్పును చెప్పారు. ఆరుగురు వ్యక్తులు తనను అత్యాచారం చేశారని యువతి ఫిర్యాదు చేస్తే... జరిగిన అత్యచారానికి యువతి కారణమంటూ రివర్స్ పంచ్ వేశారు. పైగా అందుకు కారణమైన యువతిని వెంట్రుకలు కత్తిరించి ,గ్రామామంతా తిరగాలని ఆదేశించారు. నిస్సాహయ స్థితిలో ఉన్న యువతిని గ్రామమంతా తిప్పారు. అనేక అవమానాలకు గురి చేశారు.

పోలీసులకు చెబితే తీవ్రపరిణామాలు

పోలీసులకు చెబితే తీవ్రపరిణామాలు

అంతే కాకుండా అత్యాచారం జరిగిన చోటుకు సైతం యువతిని తీసుకువెళ్లారు. మరోవైపు జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అత్యాచారం చేసిన నిందితులు యువతిని బెదిరించారు. ఈ నేపథ్యంలోనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను అత్యాచారానికి గురి చేసిన యువకుల తోపాటు వారు వహాన నంబర్‌ను సైతం పోలీసులకు ఇచ్చింది. దీంతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు యువతిని వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు..

English summary
In a shocking and shameless incident, a khap panchayat in Bihar's Gaya district has held a minor girl responsible for her gang-rape by six men. Not only this, the panchayat also issued a diktat that the girl be paraded in the village and her hair be chopped off.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X