వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుదైన వ్యాధితో ప్రాణం కోసం పసివాడి పోరాటం: సాయం చేసి ఆదుకోండి

Google Oneindia TeluguNews

ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కొడుకును చూస్తే ఆ తల్లిదండ్రులకు కలిగే బాధ అంతాఇంతాకాదు. అలాంటి బాధను ఊహించడం కూడా కష్టమే. నా జీవితంలో ఎప్పుడూ వినని తీవ్రమైన సమస్యతో నా కుమారుడు నరకవేధన అనుభవిస్తున్నాడు. అత్యంత అరుదైన వ్యాధిగా వైద్యులు సూచించిన నేపధ్యంలో దిక్కుతోచని స్థితిలో, బిడ్డ జీవితం కోసం సాయానికై చేతులు చాచి అర్ధిస్తున్నాము. వాడు నొప్పితో ఏడుస్తుంటే, మేము మానసిక క్షోభను అనుభవిస్తున్నాము.

నా 3 ఏళ్ళ కుమారుడు, సాయి దుర్గ మహేష్, ప్రైమరీ హెమోఫాగోసైటిక్ లిమ్ఫోహిస్టియోసైటోసిస్ అనే సమస్యతో పాటుగా గ్రిస్సెల్లి సిండ్రోం అని పిలిచే అరుదైన ప్రాణాంతక రుగ్మతతో బాధపడుతున్నాడు. గ్రిస్సెల్లి సిండ్రోమ్ రోగనిరోధక వ్యవస్థను తగ్గించడంతో పాటు పాక్షికంగా ఆల్బినిజంతో కూడుకుని ఉంటుంది. ప్రాథమిక HLH సమస్య, రోగనిరోధక వ్యవస్థ ప్రధాన కణాలైన T, NK కణాల పనితీరును దెబ్బతీస్తాయి. క్రమంగా బాక్టీరియాతో, సంక్రమణ రోగాలతో శరీరం పోరాడలేని స్థితికి చేరుకుంటుంది. అలోజెనిక్ బోన్ మారో మార్పిడి మాత్రమే మార్గంగా సూచించారు. కానీ ఈ శస్త్ర చికిత్స అంచనా వ్యయం సుమారు రూ. 12 లక్షల (USD 16,548) రూపాయలుగా తేల్చి చెప్పారు. రోజుకి 300 రూపాయలు (సుమారు 5 డాలర్లు) సంపాదించే నేను నా జీవితంలో ఇలాంటి సమస్యను ఎదుర్కొంటానని కలలో కూడా ఊహించలేదు. నేను క్రమంగా దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితికి చేరుకున్నానంటూ ఆ బాబు తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

A rare disorder is consuming my son’s life & our income is insufficient to treat him

నా పేరు శివరాణి. సాయి దుర్గ మహేష్ తల్లిని. ఆంధ్ర ప్రదేశ్ లోని ఒంగోలు వాస్తవ్యులం. నా భర్త రోజుకూలీగా పని చేస్తారు. అతని రోజువారీ వేతనం రూ. 300 (USD 5). ఒక సంవత్సరం క్రితం నా కుమారుడు తీవ్రమైన జ్వరం బారిన పడి బాధపడడంతో, క్రమంగా అతనిని గుడూర్ , ఒంగోల్ లోని వివిధ ఆసుపత్రులకు తీసుకెళ్లాం. మావాడికి చెన్నైలో చూపించినప్పుడు, అది సాధారణ జ్వరం కాదని, అసామాన్య స్థితిలో కుమారుని పరిస్థితి ఉన్నట్లుగా నిర్దారించారు. అప్పటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ నుంచి చెన్నైకి సూది మందుల నిమిత్తం తరచూ వెళ్ళవలసిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. అదృష్టవశాత్తూ, తన పెద్ద అక్క నా కుమార్తె అయిన రుక్మిణితో, ఎముక మజ్జ మార్పిడి శస్త్ర చికిత్సలో భాగంగా, బోన్ మారో 10/10 సరిపోయింది. అయితే ఉల్లాసభరితమైన, సంతోషకరమైన జీవితాన్ని గడిపే కుమారుడు, నిస్తేజంగా మంచానికి అంకితమైపోయి ఉండడం బాధగా ఉంది.

A rare disorder is consuming my son’s life & our income is insufficient to treat him

నాకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతో అంత మొత్తంలో కూడబెట్టడం అంటే జరగని పనే. మరే ఇతర మార్గాల్లో కూడా నేను డబ్బుని సమకూర్చలేకపోతున్నాను. ప్రయాణాలకు కూడా ఆర్థిక పరిస్థితి భారంగా మారింది. డబ్బును సమకూర్చలేని నిరుత్సాహకర స్థితిలో ఉన్నాం. బాబా చికిత్సకు రూ. 12 లక్షలు (USD 16,548) మా లక్ష్యంగా ఉంది. కానీ ఎక్కడ నుంచి తీసుకుని రావాలి ? సమయానికి చికిత్స చేయలేని పక్షంలో, అతని మనుగడ అవకాశాలు కూడా తగ్గుతాయని వైద్యులు ధృవీకరిస్తున్నారు అని బాబు తల్లి కన్నీటి పర్యంతమయ్యాురు.

మీ సహాయం కోసం అభ్యర్ధించడం తప్ప మాకు వేరొక మార్గం లేదు. మా బిడ్డ తీవ్రమైన నొప్పితో అల్లల్లాడిపోతున్నాడు. వాడు ఆ బాధ నుంచి బయటపడాలి అంటే మాకు మీ సహాయం తప్పనిసరి.

A rare disorder is consuming my son’s life & our income is insufficient to treat him

అందరి పిల్లలలాగే సాయి దుర్గ మహేష్ కూడా సంతోషంగా ఆరోగ్యకరమైన జీవితానికి అర్హుడు. అతనికి అతని జీవితాన్ని తిరిగి బహుమతిగా అందివ్వడంలో మనందరమూ చేతులు కలుపుదాం. మీ నుంచి ఏ చిన్న సహకారం అందించినా ఆ పిల్లవాని జీవితాన్ని కాపాడినవారవుతారు. ప్రతి రూపాయి విలువైనదే. ఈ వ్యాసాన్ని మీ స్నేహితులు, లేదా సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడం ద్వారా కూడా నలుగురికీ సమస్యను చేరవేసిన వారవుతారు. దయచేసి స్పందించండి. ఆ పసివాడి జీవితాన్ని నిలబెట్టండి.

ఆపదల్లో మీకు డబ్బు అవసరం ఉందా? కెట్టో సంస్థ ద్వారా మీరు ఫండ్ రైజ్ చేసుకోవడానికి వీలుంది. జబ్బుల బారిన పడి కొట్టుమిట్టాడుతున్న వారు, ఆపదల్లో ఉన్నవారు సాయం కోరడానికి కెట్టో మంచి వేదిక. మా టీమ్ లోని సభ్యులు ఎప్పటికప్పుడు మీ సమస్యను అందరికీ చేరేలా చేసి మీకు నిధులు చేకూరేలా చేస్తారు. ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉండేందుకు మేము మావంతు ప్రయత్నం చేస్తున్నాం. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X