• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'వీరప్పన్ హత్యకు వేసిన స్కెచ్' : సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్న పుస్తకం

|

కర్ణాటక : గంధపు చెక్కల స్మగ్లర్ గా, అంతకుమించి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెట్టిన విలన్ గా చరిత్రకెక్కిన వీరప్పన్ గాథ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఇటీవలే సిల్వర్ స్క్రీన్ పై దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. కాగా, వీరప్పన్ హంటింగ్ పై జనంలో ఉన్న ఆతృత మేరకు వీరప్పన్ ను తుదముట్టించిన 'ఆపరేషన్ కొకూన్' కూడా త్వరలోనే పుస్తకం రూపంలో రాబోతుంది.

వీరప్పన్ ను చంపడానికి నిర్వహించిన ఆపరేషన్ కొకూన్ కి నేతృత్వం వహించి వీరప్పన్ ని మట్టుపెట్టిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ ఈ పుస్తకాన్ని తీసుకురాబోతున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వీరప్పన్ సినిమా చూసిన తర్వాత చాలామంది జనం వీరప్పన్ హంటింగ్ గురించి పుస్తకం తీసుకొస్తే బాగుంటుందని సలహా ఇవ్వడంతో ఆ దిశగా ప్రయత్నాలు సాగించినట్టు చెప్పారు విజయ్.

వీరప్పన్ కోసం ఆపరేషన్ నిర్వహించిన సమయంలో తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ విజయ్ కుమార్, ఆపరేషన్ కొకూన్ ని ముందుండి నడిపించారు.
పక్కా ప్లాన్ ప్రకారం టీమ్ కి మార్గదర్శకాలు ఇస్తూ.. చివరికి అక్టోబర్ 19, 2004 నాడు వీరప్పన్ ను హతమార్చడంలో విజయం సాధించారు.

A ‘real’ Veerappan thriller is in the making

ఈ మొత్తం వ్యవహారాన్ని అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసిన వ్యక్తిగా, వీరప్పన్ ని చంపే క్రమంలో ధర్మరి అడవుల్లో తాము ఎదుర్కొన్న పరిస్థితులన్నింటిని పుస్తకం ద్వారా వివరించారు. ముఖ్యంగా ఇప్పటి యువతను దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకం రూపొందించినట్టుగా తెలిపారు.

వీరప్పన్ ను చంపడానికి పట్టిన పది నెలల కాలంలో ఆపరేషన్ కొకూన్ కి తామెలా సిద్దమయ్యింది..? ఆపరేషన్ కోసం ఎలాంటి వ్యూహాలను రచించింది..? ప్రతీ ఒక్కటి పుస్తకంలో పొందుపర్చినట్టుగా పేర్కొన్నారు. 12 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటన గురించి ఇప్పటి యువతకు తెలియాలనే ఉద్దేశంతోనే వెయ్యి పేజీల నిడివి గల ఈ పుస్తకాన్ని వెలువరిస్తున్నట్టుగా తెలియజేశారు విజయ్.

అయితే భద్రతా కారణాల రీత్యా.. ఆపరేషన్ లో పాల్గొన్న కొంతమంది అధికారులు పేర్లు వెల్లడించలేకపోతున్నానని, అలాగే అధికారిక రికార్డుల్లో ఉన్నట్టుగా తన పుస్తకం రోజువారి డైరీ తరహాలో ఉండదని వెల్లడించారు.

1975 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ 2012లో రిటైర్ట్ మెంట్ అయిన తర్వాత, కర్ణాటక భద్రతా సలహా అధికారిగా నియమించబడ్డారు.

English summary
With Ram Gopal Varma’s Veerappan reviving memories of the colourful elephant-poaching bandit, one more thriller about him is now on the cards a non-fiction book by the IPS officer who was behind the operation that killed him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X