వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Video Viral:అరుదైన రెండు తలల రక్తపింజరి పాము.. కాటేస్తే కాటికే..!

|
Google Oneindia TeluguNews

ముంబై: తమిళనాడులోని కోయంబత్తూరు జూలో ఒకేసారి 33 పిల్లలు పెట్టిన రక్తపింజరి పాము ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అదే జాతి పాముకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది. మహారాష్ట్రలో రెండు తలలు ఉన్న రక్తపింజరి పాము ప్రత్యక్షమైంది. అక్కడి స్థానికులు దీన్ని చూసేందుకు ఎగబడ్డారు. ముంబై శివార్లలోని కళ్యాణ్ గంధార్ రోడ్డులో ఈ పామును సురక్షితంగా పట్టుకున్నారు. ఈ పాము 11 సెంటీమీటర్ల పొడుగు ఉండగా ఆ పాము ఒక్కో తల 2 సెంటిమీటర్ల వెడల్పు ఉన్నట్లు అధికారులు చెప్పారు.

ముంబైలోని కళ్యాణ్ ప్రాంతంలో నివాసముండే డింపుల్ షా ముందుగా ఈ రెండు తలల అరుదైన రక్తపింజరి పామును రోడ్డుపై గమనించాడు. ఇది అప్పుడే పుట్టిన రక్తపింజరి పాము అని చెప్పాడు. వెంటనే వార్ రెస్క్యూ ఫౌండేషన్‌ను సంప్రదించి ఈ రెండు తలల పాముగురించి తెలిపినట్లు డింపుల్ షా చెప్పారు. ఇదిలా ఉంటే ఈ అరుదైన రెండు తలల రక్తపింజరి పామును ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విటర్ వేదికగా ఈ పాముకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. రెండు తలల రక్తపింజరి పామును మహారాష్ట్రలో కాపాడటం జరిగిందని సుశాంత నంద ట్వీట్ చేశారు. అయితే ఇది ఎక్కువ కాలం బతకదని కూడా చెప్పారు.

A rear Two headed Viper snake found in Mumbai, Video goes viral on social media

రక్తపింజరి పాము భారత దేశంలో ఉండే అత్యంత విషపూరితమైన పాము. అంతేకాదు పాము కాటుకు భారత్‌లో చాలామంది మృతి చెందుతున్నారంటే అది రక్తపింజరి కాటు వల్లే ఎక్కవగా జరుగుతున్నాయని ఒక అధ్యయనం వెల్లడించింది. ఇక రక్త పింజరి ఇతర పాములతో పోలిస్తే చాలా విషపూరితమని చెప్పిన సుశాంత నంద తొలికాటుకు బతికి బట్టకట్టినా ... దీర్ఘకాలంలో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. వీడియోను పోస్టు చేసిన కొద్ది క్షణాలకే విపరీతమైన రీట్వీట్లు లైకులు దక్కాయి.

మరోవైపు ఈ అరుదైన రెండు తలల రక్తపింజరి పామును పరేల్‌లోని హాఫ్‌కిన్ ఇన్స్‌టిట్యూట్‌కు అప్పగిస్తామని చెప్పారు. సాధారణంగా రెండు తలల పాములు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అంతేకాదు రెండు తలల పాములు ఉంటాయని చాలా సార్లు వినేఉంటాం. ఇవి జన్యులోపంతో ఇవి పుడతాయని పాములపై అవగాహన ఉన్న నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది మే నెలలో ఓ రెండు తలలు పూర్తి స్థాయిలో ఉన్న పాము ఒడిషాలో కనిపించింది.

English summary
A two-headed snake was captured in Maharashtra on Thursday. The rare two-headed Russell's Viper was rescued from Kalyan's Gandhare Road area on the outskirts of Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X