వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో: ఆసుప‌త్రిలో రోగిని చిత‌గ్గొట్టిన డాక్ట‌ర్‌! బెడ్‌పైకి ఎక్కి మ‌రీ దంచేశాడు!

|
Google Oneindia TeluguNews

జైపూర్: వైద్యో నారాయ‌ణో హ‌రీ అంటారు పెద్ద‌లు. పోయే ప్రాణాల‌ను నిలిపే వైద్యులంటే సాక్షాత్తూ ఆ శ్రీమ‌న్నారాయ‌ణుడితో స‌మానం అనేది దీని సారాంశం. దేవుడి మాట అటుంచి, క‌నీసం మ‌న‌షులుగా కూడా ప్ర‌వ‌ర్తించ‌ట్లేదు డాక్ట‌ర్లు. ఈ విష‌యం చాలా సంద‌ర్భాల్లో నిరూపిత‌మైంది. ఫీజు చేతికి ముట్టందే రోగి నాడి ప‌ట్టుకోవ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని డాక్ట‌ర్లు కోకొల్ల‌లుగా ఉన్నారు. అడుగ‌డుగునా క‌నిపిస్తుంటారు.

ఇప్ప‌టిదాకా ఫీజుల వ‌ర‌కే ప‌రిమిత‌మైన కొంద‌రు డాక్ట‌ర్ల జులుం.. తాజాగా చెయ్యెత్తి కొట్టేంత వ‌ర‌కూ వెళ్లింది. వెళ్ల‌డ‌మేంటీ? కొట్టి ప‌డేశాడు కూడా. ఏ మారుమూల ద‌వాఖానాలోనో, లేక ప్రైవేట్ క్లినిక్‌లోనో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌నుకుంటే పొర‌పాటే. సాక్షాత్తూ రాష్ట్ర రాజ‌ధానిలోని ప్ర‌ఖ్యాత ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఈ దారుణం చోటు చేసుకుంది.

రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లోని ప్ర‌ముఖ స‌వాయ్ మాన్‌సింగ్ వైద్య క‌ళాశాల‌, ఆసుప‌త్రిలో ఆదివారం సాయంత్రం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో వైర‌ల్‌గా మారింది.

జ‌న‌ర‌ల్ వార్డులో బెడ్‌పై ఉన్న ఓ రోగిని ఆసుప‌త్రి రెసిడెంట్ డాక్ట‌ర్ చిత‌క్కొట్టాడు. దీనికి గ‌ల కార‌ణాలేంటో స్ప‌ష్టంగా తెలియ‌రావ‌ట్లేదు గానీ.. ఆసుప‌త్రి సిబ్బంది దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ ఆ రోగి ఫిర్యాదు చేయ‌డమే ఈ ఘ‌ట‌న‌కు దారి తీసిన‌ట్లు చెబుతున్నారు.

జ‌న‌ర‌ల్ వార్డులో తోటి రోగులు, వారి స‌హాయ‌కులు పెద్ద సంఖ్య‌లో చూస్తుండ‌గానే డాక్ట‌ర్ ఆ రోగిపై దౌర్జ‌న్యానికి దిగారు. బూతులు తిడుతూ మ‌రీ చెయ్యి చేసుకున్నాడు. అంద‌రూ చూస్తున్నార‌నే క‌నీసం భ‌యం లేకుండా, రోగి అనే ద‌యాదాక్షిణ్యాలు కూడా చూప‌కుండా దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డం అంద‌ర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

A resident doctor beat up a patient in Sawai Mansingh Hospital at Jaipur

డాక్ట‌ర్ ఆ రోగిని కొట్ట‌డానికి చెయ్యెత్తడం, దెబ్బ‌ల నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఆ రోగి వెన‌క్కి వాల‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది ఈ వీడియోలో. త‌ప్పించుకున్న‌ప్ప‌టికీ వ‌ద‌ల‌ని డాక్ట‌ర్‌.. మంచం పైకి ఎక్కి మ‌రీ రోగిని కొట్ట‌డం ఇందులో ఈ వీడియోలో రికార్డ‌య్యింది.

రెసిడెంట్ డాక్ట‌ర్ దురుసు ప్ర‌వ‌ర్త‌న‌ను అక్క‌డే ఉన్న ఓ వ్య‌క్తి త‌న మొబైల్‌లో బంధించాడు. ఈ వీడియోను సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశాడు. ఈ వ్య‌వహారం అంతా రాష్ట్ర ప్ర‌భుత్వం దృష్టికి చేరింది. ఈ ఘ‌ట‌న‌పై రాజ‌స్థాన్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ర‌ఘు శ‌ర్మ తీవ్రంగా స్పందించారు. దీనిపై పూర్తిస్థాయి విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ ప‌రిస్థితుల‌కు దారి తీసిన ఘ‌ట‌న‌ల‌తో కూడిన నివేదిక ఇవ్వాల‌ని ఆయ‌న అధికారుల‌కు సూచించారు. విచార‌ణ ముగిసేంత వ‌ర‌కూ రెసిడెంట్ డాక్ట‌ర్‌ను విధుల నుంచి త‌ప్పించాల‌ని అన్నారు.

English summary
A resident doctor beat up a patient in Sawai Man Singh (SMS) Medical College in Jaipur, Rajasthan, yesterday. Raghu Sharma, Medical & Health Minister of Rajasthan says,' We have asked for a report on the video as to what really happened.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X