వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్లో, బెడ్‌పై ప్రత్యక్షమైన రాయల్ బెంగాల్ టైగర్...! ఖాజిరంగా జూ పార్క్ దుస్థితి

|
Google Oneindia TeluguNews

అస్సాంలో కురిసిన వర్షాలకు ఖాజీరంగా నేషనల్ జూ పార్క్ 95 శాతం మేర నీటమునగడంతో జూలో ఉన్న జంతువులు కొన్ని మృతి చెందగా మరి కోన్ని జంతువులు చెల్లాచెదురయ్యాయి. ఈనేపథ్యంలోనే రాయల్ బెంగాల్ టైగర్ ఏకంగా జాతీయ రహాదారికి అనుకుని ఉన్న ఓ ఇంట్లో ప్రత్యక్షమైంది. ఇంట్లోకి చేరిన పులి బెడ్ మీదకు ఎక్కి ప్రశాంతంగా కూర్చుంది. దీంతో పులిని చూసి ఒక్కసారిగా ఆశ్ఛర్యపోయిన ఇంటి యజమాని అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడీయాలో వైరల్ అవుతోంది.

అస్సాంలో కురిసిన వర్షాలు మనుష్యులే అతలాకుతలం అయ్యారు. వరదల్లో లక్షలాదీ మంది ప్రజలు నిరాశ్రాయులు అయ్యారు. చెట్టుకోకరు పుట్టకోకరులా వెళ్లిపోయిన పరిస్థితి కనిపించింది.ఇక నోరు లేని జంతువుల పరిస్థితి మాత్రం వర్ణనాతీతంగా మారింది. వర్షాల దాటికి అస్సాంలోని నేషనల్ పార్క్ అయినా ఖాజీరంగ పార్క్‌లో ఉన్న పలు జంతువులు మృత్యువాత పడ్డాయి. వర్షాల కారణంగా సుమారు 30 జంతువులు మృతి చెందగా పలు జంతువులు నీట మునిగాయి.

A Royal Bengal tiger looked incongruous lying on a bed in house

ఈ నేపథ్యంలోనే ఇంట్లోకి చేరిన పులి వర్షాల కారణంగా నీరసించి పోవడంతో పాటు చాల అకలిగా ఉన్నట్టు పలువురు నెటిజన్లు పోస్ట్‌లు పెట్టారు.కాగా ట్రాంకలైజర్‌ను ఉపయోగించకుండానే పులిని సేఫ్ తీసుకువెళ్లినట్టు అధికారులు తెలిపారు. ఇక ఇలాంటీ వరదల్లోనే అత్యంత ఎత్తున ఉన్న పార్క్‌లోకి నీరు చేరి రెండు సంవత్సరాల క్రితం కూడ 360 జంతువులు మృత్యువాత పడగా అందులో 31 రైనోలు కూడ నీట మునిగి చనిపోయాయి.

English summary
A Royal Bengal tiger looked incongruous lying on a bed in a photograph that emerged on Twitter on Thursday from Assam's Kaziranga, where floods have left many animals dead or displaced from the world-renowned national park.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X