బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్యాండిల్ వుడ్ హీరో ఆనంద్ రెడ్డి అరెస్టు, పేరుకు హీరో, కేటుగాడు, రూ. 1. 60 కోట్ల ఏటీఎం నగదు లూటీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సినిమా హీరోగా నిలదొక్కుకోవాలనే ఆశతో పని చేస్తున్న ఉద్యోగం అడ్డం పెట్టుకుని రూ. కోట్లు లూటీ చేసిన స్యాండిల్ వుడ్ హీరోను పోలీసులు అరెస్టు చేశారు. 'కాఫి కట్టే'అనే కన్నడ సినిమాలో హీరోగా నటించిన ఎస్. ఆనంద్ రెడ్డి అలియాస్ ఆనంద్ అనే యువకుడిని అరెస్టు చేశామని బెంగళూరు పోలీసులు చెప్పారు. ఏటీఎంలో నగదు నిల్వ చెయ్యకుండా కంపెనీకి చెందిన రూ. 1. 60 కోట్లను స్యాండిల్ వుడ్ హీరో ఆనంద్ రెడ్డి లూటీ చేశాడని పోలీసులు తెలిపారు. పేరుకు మాత్రమే హీరో ఆనంద్ రెడ్డి కేటుగాడు అని పోలీసులు అంటున్నారు.

లవ్ మ్యారేజ్, టిక్ టాక్ మోజులో అక్రమ సంబంధం, భర్త నైట్ డ్యూటీలు,భార్యకు అదే పని,ఫోన్ ఎంగేజ్, క్లోజ్లవ్ మ్యారేజ్, టిక్ టాక్ మోజులో అక్రమ సంబంధం, భర్త నైట్ డ్యూటీలు,భార్యకు అదే పని,ఫోన్ ఎంగేజ్, క్లోజ్

స్యాండిల్ వుడ్ హీరో

స్యాండిల్ వుడ్ హీరో

బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న ఆనంద్ రెడ్డి సినిమా హీరో కావాలని చాల ఆశ పడ్డాడు. గత సంవత్సరం విడుదలైన కాఫీ కట్టె అనే కన్నడ సినిమాలో ఆనంద్ రెడ్డి హీరోగా చాన్స్ కొట్టేశాడు. స్యాండిల్ వుడ్ కు చెందిన అనేక మంది ప్రముఖ హాస్య నటులు కాఫీ కట్టె సినిమాలో నటించారు.

సినిమా కథ అంతే

సినిమా కథ అంతే

గత ఏడాది విడుదలైన కన్నడ సినిమా కాఫీ కట్టె చిత్ర యూనిట్ ఆశించినట్లు ప్రేక్షకాదరణ పొందలేదు. కాఫీకట్టె సినిమా విడుదలై ఎప్పుడు గౌడన్ కు చేరిందో అనే విషయం కన్నడ సినీ ప్రేక్షకులకు గుర్తులేదు. ఇదే సినిమాలో హీరోగా నటించిన ఆనంద్ రెడ్డికి స్యాండిల్ వుడ్ లో అంతంత మాత్రంగా గానే గుర్తింపు వచ్చింది.

మంచి కంపెనీలో ఉద్యోగం

మంచి కంపెనీలో ఉద్యోగం

లాజీ క్యాష్ అనే కంపెనీలో ఆనంద్ రెడ్డి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. బెంగళూరు నగరంలోని అనేక బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం మిషన్స్ లో లాజీ క్యాష్ సంస్థ నగదు నిల్వ చేస్తున్నది. ఇదే కంపెనీలో ఏటీఎం కేంద్రాల్లో నగదు నిల్వ చేసే ఉద్యోగులకు టీం హెడ్ గా ఆనంద్ రెడ్డి పని చేస్తున్నాడు.

 సినిమా కోసం రూ. 1. 60 కోట్లు లూటీ

సినిమా కోసం రూ. 1. 60 కోట్లు లూటీ

ఏంటీఎం కేంద్రాల్లో నగదు నిల్వ చేసే సమయంలో కంపెనీ నిర్వహకులు ఎంత డబ్బులు నిల్వ చెయ్యాలని ముందుగా చెప్పారో అందులో 50 శాతం మాత్రం నిల్వ చేసిన ఆనంద్ రెడ్డి మిగిలిన 50 శాతం డబ్బులు స్వాహా చేశాడు. ఇలా ఇప్పటి వరకు ఏటీఎం కేంద్రాల్లో నిల్వ చెయ్యకుండా రూ. 1. 60 కోట్లు ఆనంద్ రెడ్డి తన జోబులో వేసుకున్నాడు.

బ్యాంకు అధికారులకు అనుమానం

బ్యాంకు అధికారులకు అనుమానం

ఏంటీఎం కేంద్రాల్లో తాము చెప్పినంత నగదు ఎందుకు నిల్వ చెయ్యడం లేదు అంటూ బ్యాంకు యాజమాన్యం లాజీ క్యాష్ కంపెనీని ప్రశ్నించింది. మీరు చెప్పినంత నగదు మీ ఏటీఎం కేంద్రాల్లో నిల్వ చేశామని లాజీ క్యాష్ కంపెనీ నిర్వహకులు సమాధానం ఇచ్చారు. అయితే ఎక్కడో తేడా వచ్చిందని లాజీ క్యాష్ కంపెనీ నిర్వహకులు పులకేశీనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఏటీఎం కేంద్రాల్లో నగదు నిల్వ చేసిన ఉద్యోగులతో పాటు ఆనంద్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

సినిమా తియ్యాలనే ఆశ

సినిమా తియ్యాలనే ఆశ

అనుకున్న స్థాయిలో కాఫీకట్టె సినిమా హిట్ కాలేదని, మరో సినిమా నిర్మించాలనే ఉద్దేశంతో తానే రూ. 1.60 కోట్లు నగదు లూటీ చేశానని ఆనంద్ రెడ్డి అంగీకరించాడని పులకేశీనగర పోలీసులు తెలిపారు. కన్నడ హీరో ఆనంద్ రెడ్డిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరు నగరంలోని పులకేశీనగర పోలీసులు తెలిపారు. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించిన ఆనంద్ రెడ్డి చివరికి కటకటాలపాలైనాడు.

English summary
A Sandalwood movie hero Anand Reddy arrested by pulakeshi Nagar police for fraud Rs. 1.60 crore to Logi Cash company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X