వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సామాన్యుడికి ఊరట: పెట్రోల్ ధరలను తగ్గించిన కేంద్రం..ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: గత కొద్దిరోజులుగా ఇంధనం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరుగుతున్న ధరల దెబ్బకు సామాన్యుడు తన వాహనాన్ని ఇంట్లోనే వదిలేసి ప్రజారవాణా వ్యవస్థను ఆశ్రయిస్తున్నాడు. విపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు, ఎదురవుతుండటంతో ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చి సామాన్యుడికి కాస్త ఊరట కలిగే వార్తను వినిపించింది. పెట్రోల్ డీజిల్ ధరలపై లీటరుకు రూ.2.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఎక్సైజ్ సుంకం రూ.1.50 తగ్గించిన కేంద్రం మరో రూపాయిని ఆయితే కేంద్రాలు తగ్గిస్తున్నట్లు తెలిపింది.

సామాన్యుడికి ఊరట

సామాన్యుడికి ఊరట

కేంద్రప్రభుత్వం ఇంధనం ధరలపై ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చింది. పెట్రోలు మరియు డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రకటన చేసింది. లీటరు పెట్రోల్ డీజిల్‌లపై రూ.2.50 తగ్గిస్తూ సామాన్యుడికి కాస్త ఊరటనిచ్చే మాట పలికింది. ఇందులో ఎక్సైజ్ సుంకం రూ.1.50ను కేంద్రం తగ్గిస్తుండగా... మరో రూపాయి తగ్గించాల్సిందిగా ఆయిల్ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో కేంద్రప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే మొత్తంలో రూ.10వేల500 కోట్లు ప్రభావం చూపనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అదే సమయంలో రాష్ట్రప్రభుత్వాలు కూడా వ్యాట్‌‌ను సేల్స్ ట్యాక్స్‌ను తగ్గించాలని కోరారు.

Recommended Video

Petrol, Diesel Prices At Record Highs, Rs 91.08 per Liter In Mumbai
ఎన్నికల స్టంటేనా..?

ఎన్నికల స్టంటేనా..?

ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్న క్రమంలో రూ.2.50 తగ్గిస్తున్నట్లు కేంద్రం కొంత ఊరటనిచ్చే ప్రకటన చేసింది. మెట్రో నగరాల్లో కాస్తో కూస్తో అతి తక్కువగా పెట్రో ధరలు ఉండేది ఢిల్లీ నగరంలోనే. ఇతర రాష్ట్ర రాజధానుల్లో పెట్రోలు లీటరు రూ.84కు పైగా పలుకుతుండగా... డీజిల్ రూ.75.45గా ఉంది. ఇక ముంబైలో అయితే లీటరు పెట్రోలు రూ. 91.34 గా ఉంది. ఇదిలా ఉంటే మరో కొన్ని రోజుల్లో జరగనున్న ఐదురాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ధరలు తగ్గింపు ప్రకటన రావడం విశేషం.

 మా పని మేము చేశాం..ఇక రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలి

మా పని మేము చేశాం..ఇక రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలి

ఇంధన ధరల తగ్గింపు మంచి ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తాయని జైట్లీ చెప్పారు. వినియోగదారులు కొంత ఇతర వస్తువులపై కూడా డబ్బులు ఖర్చు చేయాలన్నారు. ద్రవ్యలోటుపై ప్రభావం పడకుండా ఇంధన ధరలు తగ్గించడమంటే మంచి ఆర్థిక వ్యవస్థకు దారితీస్తుందని అన్నారు. ఆయిల్ ధరలు తగ్గించడం రాజకీయాలంటే.. ఇవి మంచి రాజకీయాలుగానే తాను భావిస్తానని జైట్లీ తెలిపారు. కేంద్రం తన కార్యం చేసిందని ఇక చేయాల్సిందల్లా రాష్ట్రాలేనని జైట్లీ వివరించారు. గతేడాది అక్టోబర్‌లో కూడా ఇంధన ధరలపై రూ.2 తగ్గించినట్లు వెల్లడించిన జైట్లీ.... ఆ సమయంలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు మాత్రమే మరో 2 రూపాయలను తగ్గించాయని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 86 అమెరనికా డాలర్లు పలుకుతున్న నేపథ్యంలో ఇంధన ధరలు తగ్గిస్తున్నామని చెప్పారు.

English summary
The government on Thursday announced a Rs 2.50 a litre cut in petrol and diesel prices, factoring in excise duty reduction of Rs 1.50 per litre and asking oil companies to absorb another Re 1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X