వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిగ్గుపడాలి: ఇలాగైతే హిమాలయాలను భవిష్యత్తు తరాలు చూడలేవు

|
Google Oneindia TeluguNews

హిమాలయాలు... చాలా అందమైన ప్రదేశం. చాలా చల్లని ప్రదేశం కూడా. అంతకంటే మించి మంచి పర్యాటక కేంద్రం. అలాంటి అందమైన ప్రదేశాన్ని మానవుడు భ్రష్టుపట్టిస్తున్నాడు. ఎక్కడా లేని చెత్తను అంతటి సుందరమైన ప్రదేశంలో పడేస్తూ పర్యావరణానికి హాని చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సహజ అందాలను వీక్షిద్దాం అనుకునేవారికి అక్కడ చెత్త తప్ప మరేమీ కనిపించదు. అంతలా ఆ ప్రాంతం మారిపోయింది. తాజాగా హిమాలయాల్లో కురిసిన ఓ చిన్న వర్షానికి అక్కడి ప్లాస్టిక్ సంచులు, ఇతరత్ర చెత్త అంతా కొట్టుకువచ్చి నదుల్లో కలుస్తున్నాయి. కానీ అక్కడకు వచ్చిన పర్యాటకులను అడిగితే చెత్తను వేసింది తాము కాదనే సమాధానమే వినిపిస్తుంది.

A small rain, River in Himalayas is filled with plastic and trash

అందమైన ప్రదేశాన్ని అందవిహీనంగా తయారు కావడంలో ప్రతిఒక్కరి పాత్ర ఉంది. ఎంత చెత్త అయితే అక్కడ వదిలేశామో... అదే చెత్త నదుల్లో కలిసి మళ్లీ మనకే చేరుతుందనే విషయాన్ని మరువకూడదు. హిమాలయాల్లో ప్రవహిస్తున్న ఓ నదిలో ప్లాస్టిక్ సంచులు, బాటిల్స్, పాలథీన్ బ్యాగులు, ఇతరత్రా చెత్త అంతా నదిలో ప్రవహిస్తోంది. ఈ దృశ్యాన్ని ఓ ఎన్జీఓ సంస్థ కెమరాలతో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ వీడియో చూసిన పర్యావరణ ప్రేమికులు, పర్యావరణవేత్తలు చాలా ఆవేదనకు గురయ్యారు. వారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. పర్యాటకులు హిమాలయాలకు వచ్చినప్పడు కొంత బాధ్యతతో వ్యవహరిస్తే కొంతలో కొంతైన హిమాలయాలను పరిరక్షించుకున్నవారం అవుతామని ట్వీట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని మరికొందరు సూచించారు.

వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే నెటిజెన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అదేసమయంలో ఈ చెత్తను అరికట్టేందుకు సూచనలు సలహాలు ఇచ్చారు. మరోవైపు అందమైన ప్రకృతిని కాపాడుకునేలా ప్రతిఒక్కరం ప్రతిజ్ఞ చేయాలని నెటిజెన్లు సూచించారు. ఇప్పుడు హిమాలయాలను కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలు ఆ ప్రాంతాన్ని చూడలేరని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Almost everything in the Himalayas has been explored, exploited and littered at the cost of seeing a natural beauty.In a video shared by Healing Himalayas - an NGO - a huge pile of trash can be seen making its way back to our lives through the river.Once the video was uploaded online, it attracted a lot of criticism, help and suggestions from people, but nothing can be of help if we don't pledge to keep our hills clean.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X