బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అదృష్టం: చైన్ స్నాచింగ్ లు చేస్తున్న సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని, అదే కారణం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రభాకర్ అనే యువకుడు వేరే కంపెనీల్లో ఉద్యోగం చేయ్యడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. సొంతంగా సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభించి భారీగా డబ్బు సంపాదించాలని ఆశపడ్డాడు. అనుకున్నట్లే బెంగళూరులో ప్రభాకర్ సొంతంగా సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభించాడు.

అసలు కథ అక్కడే మొదలైయ్యింది. ప్రభాకర్ స్థాపించిన సాఫ్ట్ వేర్ కంపెనీ నష్టాల్లో నడిచింది. విపరీతంగా అప్పులు చేసిన ప్రభాకర్ రుణం తీర్చడానికి చెడుమార్గాల వైపు చూశాడు. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ లో ఒంటరిగా వాకింగ్ చేస్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కొని స్కూటర్ లో పారిపోయాడు.

A software engineer arrested for alleged chain snatching in Bengaluru

మహిళ కేకలు వెయ్యడంతో గస్తి తిరుగుతున్న మల్లప్ప అనే పోలీసు ప్రభాకర్ వెలుతున్న బైక్ ను వెంబడించి ఢీకొన్నారు. ప్రభాకర్ ను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ చెయ్యగా పోలీసుల దిమ్మతిరిగిపోయింది. ప్రభాకర్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని అని వెలుగు చూసింది.

చేసిన అప్పులు తీర్చడానికి ప్రభాకర్ ఇప్పటి వరకు 20కు పైగా చైన్ స్నాచింగ్ లు చేశాడని, ఆ నగలు విక్రయించి రూ. 10 లక్షలకు పైగా రుణం తీర్చి విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని పోలీసులు విచారణలో వెలుగు చూసింది. చైన్ స్నాచింగ్ లు చెయ్యడానికి ప్రభాకర్ అతను అదృష్టంగా భావించే స్కూటర్ ఉపయోగించాడని పోలీసులు తెలిపారు.

English summary
A software engineer arrested for alleged chain snatching in Bengaluru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X