బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు రైల్వేస్టేషన్ లో గ్రానేడ్ కలకలం, పాట్నా సంఘ మిత్ర రైలు, ప్రయాణికులు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలోని కాంత్రివీర సంగోళ్ళి రాయణ్ణ (బెంగళూరు సెంట్రల్ రైల్వేష్టేషన్)లో గ్రానేడ్ కలకలం రేపింది. బెంగళూరు సెంట్రల్ రైల్వేష్టేషన్ లోని ఫ్లాట్ ఫాం నెంబర్ 1లో గ్రానేడ్ శుక్రవారం ఉదయం బయటపడింది. గ్రానేడ్ చూసిన వెంటనే ప్రయాణికులు ఆందోళనతో పరుగులు తీశారు. పోలీసుల విచారణలో అది స్వదేశంలో తయారు చేసిన కంట్రీమేడ్ గ్రానేడ్ అని వెలుగు చూసింది.

ఫ్లాట్ ఫాం నెంబర్ 1

ఫ్లాట్ ఫాం నెంబర్ 1

బెంగళూరు సెంట్రల్ రైల్వేష్టేషన్ లో ఫ్లాట్ ఫాం నెంబర్ 1 నుంచి అన్ని ఫ్లాట్ ఫాంలకు వెళ్లి రావలసి ఉంటుంది. ఫ్లాట్ ఫాం నెంబర్ 1లో గ్రానైడ్ బయటపడటంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురైనారు.ఫ్లాట్ ఫాం ట్రాక్ పక్కనే గ్రానేడ్ ను గుర్తించారు. విషయం తెలుసుకున్న బాంబు నిర్వీర్యదళం పోలీసులు సంఘటనా స్థానికి చేరుకుని పరిశీలించారు.

పేలుడు పదార్థాలు ?

పేలుడు పదార్థాలు ?

ఫ్లాట్ ఫాంలో గ్రానైడ్ బయపడిందని తెలిసిన వెంటనే మహిళా ఐపీఎస్ అధికారి డి. రూపా, ఏడీజీపీ అలోక్ మోహన్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. గ్రానేట్ ను 500 మీటర్ల దూరం తీసుకెళ్లి పరిశీలించారు. పోలీసుల పరిశీలనలో అది స్వదేశీ గ్రానేడ్ అని వెలుగు చూసిందని ఓ అధికారి తెలిపారు.

సంఘ మిత్ర రైలు

సంఘ మిత్ర రైలు

బెంగళూరు నుంచి బీహార్ లోని పాట్నాకు శక్రవారం ఉదయం 9 గంటలకు సంఘ మిత్ర రైలు బయలుదేరవలసి ఉంది. అదే రైల్వే ట్రాక్ సమీపంలో గ్రానేడ్ బయటపడింది. పరిసర ప్రాంతాల్లో మరన్ని గ్రానేడ్ లు పడి ఉండే అవకాశం ఉందనే అనుమానంతో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.

రైలు సంచారాని బ్రేక్

రైలు సంచారాని బ్రేక్

బెంగళూరు రైల్వేస్టేషన్ లోని ఫ్లాట్ ఫాం నెంబర్ 1లో రైలు సంచారాన్ని పూర్తిగా నిషేదించారు. ఉదయం 11 గంటల వరకు రైలు సంచారాన్ని పూర్తిగా నిషేదించిన పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో గాలించారు. అన్ని రైళ్లల్లో ఉన్న ప్రయాణికులను కిందకు దించి క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత రైళ్ల సంచారానికి అవకాశం కల్పించారు.

కంట్రీ మేడ్ గ్రానేడ్

కంట్రీ మేడ్ గ్రానేడ్

బెంగళూరు రైల్వేష్టేషన్ లో బయటపడింది కంట్రీ మేడ్ గ్రానేడ్ అని పోలీసులు విచారణలో వెలుగు చూసింది ముందు జాగ్రత్త చర్యగా గ్రానేడ్ లోని పేలుడు పదార్థాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రైలు ఎక్కతున్న సమయంలో అది ప్రమాదవశాత్తు కిందపడిందా ? లేదా కావాలనే ఫ్లాట్ ఫాం ట్రాక్ పక్కన పడవేశారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో హ్యాండ్ గ్రానేడ్ లు వెలుగు చూసినా అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని సమాచారం. అయితే రైల్వే ష్టేషన్ పరిసర ప్రాంతాల్లో గ్రానేడ్ లు ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
A supicious thing was found in platform no 1 of Railway station in Bengaluru on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X