హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్రెయిన్ డెడ్: ఢిల్లీలో తెలుగు టెక్కీ మృతి, అవయవదానం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బ్రెయిన్‌డెడ్‌ కావడంతో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూరపాటి అరవింద్ మృతి చెందాడు. అరవింద్ బ్రెయిన్ డెడ్ అయినట్లు పోర్టిస్ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో మృతుడి కుటుంబం అతని అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చింది.

11 అవయవాలను అరవింద్ కుటుంబం దానం చేసింది. అవయవాలను తీసుకెళ్లేందుకు ఢిల్లీ, గుడ్‌గావ్‌లో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. అరవింద్ గుండెను మరొకరికి అమర్చారు వైద్యులు. రెండు కిడ్నీలను ఆర్మీ ఆస్పత్రికి దానం చేశారు.

A telugu techie dies with brain dead in New Delhi

గుడ్‌గావ్ ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న అరవింద్ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడటంతో తీవ్రగాయాలయ్యాయి. తలకు బలంగా గాయడం కావడంతో అతని బ్రెయిన్ డెడ్ అయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అరవింద్ స్వస్థలం సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లి.

ఉర్సు ఉత్సవాల్లో ఆరుగురు మృతి

కర్ణాటక: రాయచూర్ జిల్లా యాపల్‌దిన్నె ఉర్సు ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. వాటర్ ట్యాంక్ కూలి ఆరుగురు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

English summary
A telugu techie died with brain dead in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X