వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడికి గుడి కట్టిన రైతు.. ఎక్కడ కట్టారో తెలుసా?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Farmer Builds PM Modi’s Temple And also offers prayers at the Temple Everyday

ప్రధాని నరేంద్రమోడీ దేవుడయ్యారు. గుళ్లో ఆయన విగ్రహం ప్రతిష్టించి పూజలు చేస్తున్నాడు ఆయన అభిమాని, కాగా ప్రధాని మోడీ విగ్రహంతో పాటు హోంమంత్రి అమిత్ షా, దివంగత ముఖ్యమంత్రి జయలలిత, మరియు తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి పళని స్వామి ఫోటోలను కూడ గుళ్లో పెట్టాడు. అయితే..ప్రధాని మోడీ స్కీంలు నచ్చి ఆయనకు గుడి కట్టిచ్చినట్టు రైతు తెలిపాడు.

తమిళనాడులో మోడీకి గుడి

తమిళనాడులో మోడీకి గుడి

మనుష్యులకు గుళ్లు, గోపురాలు కట్టే సంస్కృతి ఎక్కువగా తమిళనాడు ప్రజలు చేస్తారు. ఇదివరకే చాలా మంది నాయకులు, సినిమా యాక్టర్లకు కూడ తమిళనాడులో గుళ్లు కట్టి పూజిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా మనుష్యుల దేవుళ్లలోకి ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కూడ చేరారు. తమిళనాడులోని ఓ అభిమాని ప్రధాని మోడీకి గుడి కట్టి పూజలు చేయడం ప్రారంభించాడు. కాగా ప్రధాని మోడీ తీసుకువచ్చిన పలు ఫథకాలు నచ్చి ఆయనకు గుడి కట్టించానని చెప్పాడు.

మోడీ పథకాలకు ఆకర్షితుడైన రైతు

మోడీ పథకాలకు ఆకర్షితుడైన రైతు

తమిళనాడులోని ఎరకుడి గ్రామంలోని పీ శంకర్ అనే యాబై సంవత్సరాల వయస్సున్న రైతు తన వ్యవసాయ పొలంలో ప్రధాని మోడీకి గుడి కట్టి వారం రోజుల నుండి పూజలు చేస్తున్నాడు. కాగా ప్రధాని ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లాంటీ పథకాలకు మెచ్చి గుడిని కట్టినట్టు చెప్పారు. ఇందుకోసం లక్ష ఇరవై వేల రూపాయలను రైతుల ఖర్చుపెట్టినట్టు తెలిపాడు. కాగా 8 ఫీట్ల ఎత్తుతో విగ్రహాన్ని తయారు చేయించాడు. పక్కనే దీపాల కోసం స్టాండ్స్ ఏర్పాటు చేశాడు. మరోవైపు గుడిలోనే హోంమంత్రి అమిత్ షా, ప్రస్తుత తమిళనాడు సీఎం పళని స్వామి మరియు దివంగత సీఎం జయలలిత ఫోటోలను కూడ గుడిలో పెట్టాడు.

బీజేపీ సభ్యుడు కాని రైతు

బీజేపీ సభ్యుడు కాని రైతు

అయితే శంకర్ కనీసం బీజేపీ కార్యకర్త కూడ కాదని చెప్పాడు. కేవలం ఆయన పథకాలకు ఆకర్షితుడయి గుడిని నిర్మించాడని చెప్పాడు. అయితే గుడి నిర్మించేందుకు ఎనిమిది నెలల క్రితం పునాది వేసినట్టు చెప్పారు. కాని వెంటనే దాని నిర్మాణం చేపట్టలేకపోవడంతో గత వారమే ప్రారంభించినట్టు చెప్పాడు. దీంతో విషయాన్నితెలుసుకున్న బీజేపీ నాయకులు శంకర్ దగ్గరకు చేరుకుని ఆయన్ను పార్టీలో చేరాలని అహ్వానించారు. కాగా ప్రధానిని నేరుగా చూసేందుకు ఓసారి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మమల్లా పురానికి వచ్చినప్పుడు వెళ్లానని చెప్పాడు. కాగా గతంలో శంకర్ కొన్నేళ్లు గల్ఫ్‌లో పని చేసి అనంతరం ఆడబ్బులతో గ్రామంలో వ్యవసాయ భూమి కొన్నానని చెప్పాడు.

English summary
The 50-year old farmer, was built a temple to pm narendra modi in tamilnadu and inaugurated last week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X