వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంధువులపై కోపంతో మత్తిచ్చి 3 ఏళ్ళ చిన్నారి హత్య

బంధువులపై పెంచుకొన్న కోపంతో అభం శుభం తెలియని మూడేళ్ళ అబ్బాయిని హత్య చేశాడు ో నిందితుడు ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

శివమొగ్గ: బంధువులపై పెంచుకొన్న కోపంతో అభం శుభం తెలియని మూడేళ్ళ అబ్బాయిని హత్య చేశాడు ో నిందితుడు ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో చోటుచేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని హోసనగర తాలుకా మారుతీపుర గ్రామపంచాయితీ పరిధిలో మూలెగెర్ల సదానంద శివయోగాశ్రమంలో చోటు చేసుకొంది.

పూణెలోని గంధర్వనగరిలో నివాసం ఉంటూ అక్కడి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న కుమారస్వామి , ఛైత్ర దంపతుల బంధువులకు హోసన్ నగర్ తాలుకా మారుతీపుర గ్రామపంచాయితీ పరిధిలోని మూలెగిద్ద సదానంద శివయోగ్రాశ్రమ మఠంలో పరిచారకుడిగా పనిచేస్తున్న రుద్రేష్ కు విబేధాలున్నాయి.

A three years old boy murdered by Rudresh

సదనానంద శివమోగాశ్రమం మఠంలో జరుగుతున్న చిన్న స్వామిజీ పట్టాభిషేక ఉత్సవాల్లో పాల్గొనేందుకు వారం రోజుల క్రితం ఛైత్ర తగన మూడేళ్ళ కుమారుడు సుహాయ్ తో కలిసి వచ్చింది.

ఛైత్ర బంధువులపై కక్ష పెంచుకొన్న రుద్రేష్ పై అదే అదనుగా హత్యకు పథకం పన్నాడు. సోమవారం రాత్రి నిద్రమాత్రలు కలిపిన సొంబర్ అన్నాన్ని రుద్రేష్ వడ్డించాడు.

ఈ అన్నం తిన్న ఛైత్ర ఆమె కుమారుడు మరికొందరు భక్తులు గాఢ నిద్రలోకి జారుకొన్నారు. అర్ధరాత్రి సమయంలో తల్లి పక్కనే ఉన్న బాలుడు రుద్రేష్ ను ఎత్తుకెళ్ళి మఠం వెనుకకు చేరుకొని ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు రుద్రేష్.

అనంతరం మృతదేహన్ని చెరువులో పారేశాడు. మంగళవారం నాడు ఉదయం చిన్నారి కన్పించకపోవడంతో ఛైత్రతోపాటు నలుగురు వ్యక్తులు అస్వస్థతకు గురవడం ఆశ్రమంలో కలకలం రేపింది.

అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరించారు. ఈ విషయమై పోలీసులు ఆశ్రమానికి చేరుకొని విచారించారు. రుద్రేష్ ను అనుమానంతో అదుపులోకి తీసుకొన్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం బయటపడింది.

English summary
A three years old boy murdered by Rudresh in Karnataka on Monday.police arrested Rudresh on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X