వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్‌టాక్ వీడియో కోసం పోలీస్ వెహికిల్‌...? కాదంటున్న పోలీసులు...!

|
Google Oneindia TeluguNews

టిక్‌టాక్ వీడీయోల కోసం పలువురు యూజర్లు నానా తంటాలు పడుతున్నారు.లేనివి సృష్టించి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు.. వైరైటీ వీడియోను రూపోందించి..పాపులర్ కావాలనే యోచనలో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు...దీంతో కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా మరి కొందరు వివాదాలకు కేంద్రబిందువు అవుతున్నారు...తాజాగా ''పోలీసు వాహానం'' అని రాసి ఉన్న వాహానాన్ని టీక్‌టాక్ వీడీయో కోసం ఉపయోగించాడు.

తాజాగా ఢిల్లీలోని ఓ వ్యక్తి టిక్‌టాక్ వీడీయో కోసం వినూత్నంగా ఆలోచించాడు.. అయితే అది చట్టవిరుద్దమని తెలియక చిక్కుల్లో పడ్డాడు. ఈనేపథ్యంలోనే వీడియో కోసం పోలీస్ వాహనం ఉపయోగిస్తే... వీడీయో పాపులర్ అవుతుందని భావించిన సదరు వ్యక్తి డమ్మీ పోలీసు వాహానాన్ని సృష్టించాడు....ఎడారీ ప్రాంతంలో దానిపై ఫీట్లు చేశాడు..షర్ట్ లేకుండా అటు ఇటు దూకాడు..అనంతరం వాహనం పైకి ఎక్కి పుషప్స్ చేశాడు. అనంతరం ఆ వీడీయోను సోషల్ మీడీయాలో పోస్ట్ చేశాడు.

A TikTok video showing a man performing dangerous stunts on a dummy Delhi Police car

దీంతో ఆ వీడియో టిక్‌టాక్‌లో హల్‌చల్ చేస్తుంది..పోలీస్ వాహానాన్నే ఫీట్ల కోసం వాడుకోవడంతో వీడియో పాపులర్ అయింది.. ఇక వీడీయోను చూసిన ఓ యూజర్ దీనిపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. టిక్ టాక్ వీడియో కోసం పోలీసు వాహానం వినియోగించడంపై ప్రశ్నించాడు.. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. వీడియోలో ఉపయోగించింది అసలు పోలీసుల వాహానమేనా కాదా అనే కోణంలో దర్యాప్తు చేశారు..చివరికి వీడియోలో ఉన్న వెహికిల్ ఓ ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిందిగా తేల్చారు. అది ఢిల్లీకి చెందిన జే.పీ శర్మ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయినట్టు పోలీసులు కనుగొన్నారు. మరోవైపు వీడీయోను అప్‌లోడ్ చేసిన వ్యక్తిపై కూడ తగు చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు.

English summary
A TikTok video showing a man performing dangerous stunts on a Delhi Police car went viral on social media on Wednesday.In the video, a shirtless man could be seen stepping out of the moving vehicle and doing push-ups atop the car in what seemed to be a deserted spot
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X