వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్ ఉదృతమైన జూ.డాక్టర్ల సమ్మే...18 డాక్టర్ల రాజీనామ

|
Google Oneindia TeluguNews

నాలుగు రోజులుగా కొనసాగుతున్న డాక్టర్ల సమ్మే నేడు తీవ్రస్థాయికి చేరింది..ఇలాంటీ పరిస్థితుల్లో ఉద్యోగం చేయలేమంటూ బెంగాల్‌లో 18 మంది డాక్టర్లు తమ పదవులకు రాజీనామ చేశారు. మరోవైపు డాక్టర్ల సమస్యపై పట్టుదలకు పోకుండా సమస్యను పరిష్కరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ మమతా సర్కార్‌కు అప్పీల్ చేశారు. మరో వైపు దేశవ్యాప్తంగా బెంగాల్ డాక్టర్లకు మద్దతుగా నిరసనలు కొనసాగుతున్నాయి.

బెంగాల్‌లో 18 మంది డాక్టర్లు రాజీనామ

బెంగాల్‌లో జరుగుతున్న తాజపరిమాణల నేపథ్యంలో మమతా సర్కార్ దిగి రాకపోవడంతో బెంగాల్‌ని రెండు ఆసుపత్రుల్లో 18మంది డాక్టర్లు తమ విధులు కొనసాగించలేమంటూ రాజీనామా లేఖలు పంపారు. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి చెందిన 16మంది రాజీనామచేయగా నార్త్ బెంగాల్ ఆసుపత్రికి చెందిన మరో ఇద్దరు బెంగాల్ హెల్త్ డిపార్ట్మెంట్‌కు రాజీనామా సమర్పించారు. . ప్రస్థుతం ఉన్న పరిస్థితుల్లో తాము విధులు నిర్వహించలేమంటూ లేఖలు రాశారు.కాగా గురువారం రాత్రే ఎన్ఆర్ఎస్ ఆసుపత్రి సూపరిండెంట్ సైతం రాజీనామ చేశారు.

డాక్టర్ల నిరసనపై కేంద్ర మంత్రి స్పందన

ఇక బెంగాల్ డాక్టర్ల సమ్మెపై కేంద్రం కూడ దృష్టి సారించింది. డాక్టర్ల సమస్య పరిష్కరించేందుకు పట్టుదలకు వెళ్లద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోరారు. దీనిపై మమతకు లేఖ రాస్తానని చెప్పారు. ఇక ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేశానని ఈనేపథ్యంలోనే కేంద్రమంత్రిని ఏయిమ్స్ వైద్యుల బృందం మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందించింది. ఈనేపథ్యంలోనే డాక్టర్లు అనుకూలమైన వాతవరణంలో పనిచేసతే పరిస్థితులను కేంద్రం కల్పించేందుకు కట్టుబడి ఉందని వారికి తెలిపారు.

దేశవ్యాప్తంగా బెంగాల్‌ డాక్టర్లకు మద్దతు

దేశవ్యాప్తంగా బెంగాల్‌ డాక్టర్లకు మద్దతు

బెంగాల్‌లో జూనియర్ డాక్టర్లపై దాడి జరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డాక్టర్ల నిరసనలను రాజకీయ కుట్రలుగా అభివర్ణిస్తుంది.దీంతో వారితో చర్చించేదుకు ముందుకు రావడంలో లేదు. ఈనేపథ్యంలోనే రాష్ట్ట్రంలో ప్రారంభమైన ఆందోళనలు దేశవ్యాప్తమయ్యాయి. ఐఎమ్ఏ యూనియన్ నాయకులు రంగంలోకి దిగడంతో పలు పలు పట్టణాల్లో వారికి మద్దతుగా నిరనలు కొనసాగిస్తున్నారు.

English summary
total of 18 doctors in two Bengal government hospitals resigned on Friday as the doctors' protests entered the fourth day.Sixteen doctors of the RG Kar Medical College and Hospital in Kolkata have submitted their resignation to the health department of the West Bengal government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X