వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రాప్, ట్రాపర్, ట్రాప్డ్: ప్లాస్టిక్ బాటిళ్ల నిషేధంపై వినూత్న ప్రదర్శన: ఎక్కడో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: ప్లాస్టిక్ వినియోగం వల్ల సంభవించే నష్టాలేమిటో తెలుసు. ప్లాస్టిక్ కవర్లలో వేడి పదార్థాలను ప్యాక్ చేయడం, ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ ఉంచిన నీటిని తాగడం, అదే నీటిని రోజువారీ అవసరాలకు వాడుకోవడం వంటి చర్యల వల్ల మనకు తెలియకుండానే కేన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలను కారణమౌతుంటాం. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడంపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన కలుగుతోంది. పలు మున్సిపాలిటీల్లో వాటి వినియోగాన్ని నిషేధిస్తున్నారు.

ఆర్మీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించిన మనోజ్ ముకుంద్: చైనాతో సరిహద్దు వివాదాల పరిష్కర్తగా..!ఆర్మీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించిన మనోజ్ ముకుంద్: చైనాతో సరిహద్దు వివాదాల పరిష్కర్తగా..!

అదలావుంచితే- మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే సామాజిక అంశాల్లో అవగాహన, వాటి పట్ల చైతన్యం కాస్త ఎక్కువే ఉంది మలయాళీలకు. తరచూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ సారి కూడా వారు తమదైన శైలిని ప్రదర్శించారు. ప్లాస్టిక్, దానితో తయారు చేసిన బాటిళ్లను వినియోగించడం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ఓ సరికొత్త ప్రయోగానికి తెర తీశారు.

a trapped man in a plastic bottle: a campaign against the use of plastic in Kerala

కోచిలో ఓ భారీ ప్లాస్టిక్ బాటిల్ నమూనాను నిర్మించారు. దీనికోసం వారు వందలాది చిన్న ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగించారు. ప్లాస్టిక్ బాటిళ్లలో మనిషి చిక్కుకునిపోయాడనే అర్థం వచ్చేలా ఓ థీమ్ ను రూపొందించారు. ప్లాస్టిక్ బాటిళ్లలో మనిషి చిక్కుకున్నాడనడానికి నిదర్శనంగా.. ఓ బొమ్మను అందులో పొందుపరిచారు. ప్రతి బాటిల్ లోనూ ఓ మనిషి బొమ్మ ఉంచారు. ట్రాప్..ట్రాపర్.. ట్రాప్డ్.. అనేది ఈ థీమ్ ట్యాగ్ లైన్.

a trapped man in a plastic bottle: a campaign against the use of plastic in Kerala

ప్రస్తుతం ఈ బాటిల్ కోచివాసులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకుని దీన్ని ఏర్పాటు చేసినందు.. పెద్ద ఎత్తున స్థానికులు దాన్ని సందర్శిస్తున్నారు. సెల్పీలు దిగుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తోన్న ఓ స్వచ్ఛంద సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. ఇలాంటి థీమ్ ను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడానికి ఈ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజధాని తిరువనంతపురం సహా అన్ని ప్రధాన నగరాల్లో దాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు.

English summary
As part of a campaign against the use of plastic, a structure depicting ‘a trapped man in a plastic bottle' has been set up in Kochi city in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X