వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడుగురికి జీవితాలను గిఫ్ట్ గా ఇచ్చిన రెండేళ్ళ బాలుడు

|
Google Oneindia TeluguNews

రెండున్నర ఏళ్ల బాలుడు ఏడుగురు జీవితాలలో వెలుగులు నింపాడు. ఏడుగురికి జీవితాన్ని ఇచ్చాడు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన రెండున్నర సంవత్సరాల బాలుడు జాష్ ఓజా అతి పిన్న వయస్కుడైన అవయవ దాతగా గుర్తించబడ్డాడు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో జాష్ ఓజా అనే రెండున్నర సంవత్సరాల బాలుడు డిసెంబర్ 9వ తేదీన ఇంట్లోని బాల్కనీ నుండి కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే తల్లిదండ్రులు జాష్ ఓజా ను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.

చిన్నారి వంటలక్క: 58 నిమిషాలలో 46 రకాల వంటలు చేసి వరల్డ్ రికార్డ్స్ లో స్థానంచిన్నారి వంటలక్క: 58 నిమిషాలలో 46 రకాల వంటలు చేసి వరల్డ్ రికార్డ్స్ లో స్థానం

బాల్కనీ నుండి క్రిందపడిన జాష్ ఓజా.. బ్రెయిన్ డెడ్

బాల్కనీ నుండి క్రిందపడిన జాష్ ఓజా.. బ్రెయిన్ డెడ్

వైద్యులు పసికందును కాపాడడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటికే మెదడు నుండి తీవ్ర రక్తస్రావం కావడంతో జాష్ ఓజా కు బ్రెయిన్ డెడ్ అయింది . వైద్యులు తల్లిదండ్రులకు జాష్ ఓజా బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు. తన కొడుకు తిరిగి నవ్వుతూ ఇంటికి వస్తాడని ఆశపడ్డ తల్లిదండ్రులు డాక్టర్లు చెప్పిన విషయానికి శోకసంద్రంలో మునిగిపోయారు. ఇదే సమయంలో బాబు అవయవాలతో ఇతరుల ప్రాణాలు కాపాడాలని సూరత్ కు చెందిన ఎన్జిఓ డొనేట్ లైఫ్ అధ్యక్షుడు నీలేష్ మాండ్లేవాలా ఆసుపత్రికి చేరుకుని అవయవదానానికి జాష్ తండ్రి సంజీవ్ ఓజా ను ఒప్పించారు.

 అవయవదానానికి ఒప్పుకున్న తల్లిదండ్రులు అవయవదానానికి ఒప్పుకున్న తల్లిదండ్రులు

అవయవదానానికి ఒప్పుకున్న తల్లిదండ్రులు అవయవదానానికి ఒప్పుకున్న తల్లిదండ్రులు

తల్లిదండ్రులు సైతం తమ కొడుకు అవయవాలతో ఇతర పిల్లలకు ప్రాణం పోయాలని నిర్ణయించుకొని అవయవదానానికి ఒప్పుకున్నారు. తల్లిదండ్రులు అర్చన, సంజీవ్ ఓజాల అంగీకారంతో జాష్ ఓజా గుండె, ఊపిరితిత్తులు, కళ్ళు, కాలేయం, కిడ్నీలను అవసరం ఉన్న పేషెంట్లకు వైద్యులు వెంటనే పంపించారు.గుండెను నాలుగేళ్ల రష్యా కుర్రాడికి, ఊపిరితిత్తులను ఉక్రెయిన్‌కు చెందిన మరో నాలుగేళ్ల బాలుడికి చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో మార్పిడి చేశారు .

ఐదుగురి ప్రాణాలు కాపాడిన అతి పిన్న వయస్కుడైన అవయవ దాత

ఐదుగురి ప్రాణాలు కాపాడిన అతి పిన్న వయస్కుడైన అవయవ దాత

అహ్మదాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐకెడిఆర్‌సి) ద్వారా సురేంద్రనగర్‌కు చెందిన 13 ఏళ్ల బాలికకు, సూరత్‌కు చెందిన 17 ఏళ్ల బాలికకు కిడ్నీలు మార్పిడి చేశారు. ఐకెడిఆర్‌సిలో రెండేళ్ల బాలుడికి కాలేయాన్ని మార్పిడి చేశారు. కార్నియాలను సూరత్‌లోని లోక్ దృష్టి ఐ బ్యాంకుకు విరాళంగా ఇచ్చారు. అతి పిన్న వయస్కుడైన రెండున్నరేళ్ల జాష్ ఓజా మరో ఏడుగురికి జీవితాలను గిఫ్ట్ గా ఇచ్చి చిరంజీవిగా మిగిలిపోయాడు. పుట్టెడు దుఃఖం లోనూ అవయవ దానం చేయాలని జాష్ ఓజా తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవడం, మరో ఏడుగురు జీవితాల్లో వెలుగులు నింపగా , వారి ఔన్నత్యాన్ని గుజరాత్ వాసులు, వైద్యులు కొనియాడుతున్నారు.

English summary
A two-and-a-half year-old boy from Gujarat became the youngest cadaver donor, giving a new lease of life to seven children, including two from Russia and Ukraine, after his parents donated his organs. Jash’s heart, liver, lungs, both kidneys and eyes were donated after his parents Sanjeev Oza and Arachana agreed for the noble cause.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X