వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: బెల్ట్ తో కొట్టుకుంటూ బర్త్ డే సెలబ్రెషన్స్.. అదీ ప్రభుత్వ ఆస్పత్రిలో.. వీడియో వైరల్..

|
Google Oneindia TeluguNews

దేశంలో సరైన వైద్యం అందక చాలా మంది మరణిస్తున్నారు. దేశంలో దాదా అంతా కార్పొరేట్ వైద్యం అయిపోయింది. కాసులుంటే తప్ప వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. సర్కార్ దవాఖాన్లు ఉన్న సరిగా వైద్యం చేయరు. వైద్యం చేయడానికి వైద్యులు ఉన్నా అక్కడ సౌకర్యాలు ఉండవు. డబ్బులు లేని నిరుపేదలకు ప్రభుత్వ ఆస్పత్రే దిక్కు.

ఇబ్బందులు పడ్డ పేషెంట్లు..

ఇబ్బందులు పడ్డ పేషెంట్లు..

సర్కార్ దవాఖానే వారికి దేవాలయం. వైద్యం అందినా, అందకపోయినా వారికి గవర్నమెంట్ ఆస్పత్రే దిక్కు. పేదలకు దేవాలయంగా ఉన్న ఆస్పత్రిలో జన్మదిన వేడుకలు జరిపారు. పుట్టిన రోజు వేడుకలు జరిపితే తప్పు ఏమిటని మీరు అడగొచ్చు. బర్త్ వేడుకలు జరుపుకోవచ్చు కానీ పేషెంట్లకు ఇబ్బంది కలిగేలా చేసుకోవద్దు.

బెల్ట్ తో కొట్టుకుంటూ..

బెల్ట్ తో కొట్టుకుంటూ..

కేక్ కటింగ్ అంటే ఓకే, కొంత అల్లరి చేశారంటే ఓకే కానీ బెల్ట్ తో కొట్టుకుంటూ జన్మదిన వేడుకలు జరుపుకోవడం పిచ్చి పిక్స్ వెళ్లినట్లే కదా, బర్త్ డే న్యూసెన్స్ తో అక్కడున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. లక్నోలోని ఓ సివిల్ హాస్పిటల్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

స్పందించిన మంత్రి..

ఈ వీడియోలో విద్యార్థుల గుంపు ఒకరినొకరు బెల్టుతో సరదాగా కొట్టుకోవడం, వారి ముఖాలకు కేక్ అద్ది ఆ ప్రదేశం చుట్టూ పరిగెత్తడం కనిపిస్తుంది. ఈ విషయమై తీవ్ర విమర్శలు రావడంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సోమవారం ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ బర్త్ డే వేడుకలు ఆదివారం అర్ధరాత్రి సుమారు గంటసేపు జరినట్లు తెలుస్తుంది.

చర్యలు తీసుకుంటాం..

చర్యలు తీసుకుంటాం..

దీంతో ఆసుపత్రిలోని రోగులకు ఇబ్బంది కలిగించిందని వార్తా సంస్థ IANS నివేదించింది. ఈ వీడియోను తన దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ జరుపుతున్నామని సివిల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ ఓజా తెలిపారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

English summary
A video of birthday celebrations taking place inside a civil hospital in Lucknow has gone viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X