వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: హృదయాన్ని కదిలిస్తున్న వీడియో.. అమ్మ ప్రేమకు ఇదే నిదర్శనం..

|
Google Oneindia TeluguNews

సృష్టిలో స్వచ్ఛమైన ప్రేమ ఏదైన ఉందంటే.. అది అమ్మ ప్రేమ మాత్రమే.. ఎందుకంటే ఆ ప్రేమలో ఎలాంటి స్వర్థం ఉండదు. ప్రతి ఒక్క తల్లి తన పిల్లలే జీవితంగా బతుకుతుంది. తాను తిన్నా తినుకున్నా పిల్లలకు మాత్రం పెడుతుంది. ఈ తల్లి ప్రేమ మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ కూడా ఉంటుంది. ఈ అమ్మకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఓ కొండముచ్చు తన బిడ్డను హత్తుకుని కనిపిస్తుంది. అక్కడికి వచ్చిన ఓ బాలిక పిల్ల కొండముచ్చును బలవంతంగా తీసుకుంటుంది. కానీ తన బిడ్డను ఎక్కడ దూరం చేస్తారో అని అ తల్లి కొండముచ్చు వెంటనే ఆ బాలిక వద్దకు వెళ్లి తన బిడ్డను తీసుకుంటుంది. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న వారు ఒకరు మొబైల్ లో బంధించారు.

A video of Mothers love has gone viral on social media

ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. తరెక్ ఫతహ్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. వీడియోతో పాటు ఇది ఇండియాలో మాత్రమే.. అని రాసుకొచ్చారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి హృదయం కదిలింది. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ఈ దృశ్యం కళ్లకు కట్టింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ట్వీట్ ను చాలా మంది రీట్వీట్ కూడా చేశారు.


ఈ వీడియో చూసిన నెటిజన్లు కొండముచ్చు ప్రేమకు ఫిదా అయిపోయారు. అమ్మ ప్రేమకు అవధులు ఉండవని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఈ వీడియో నా హృదయాన్ని కదిలించిందని మరొక నెటిజన్ కామెంట్ చేశారు.

English summary
A video of Mother's love has gone viral on social media. this video gone lakhs views.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X