వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: రోడ్డుపై పిచ్చి పిచ్చి చేస్తే ఇలానే ఉంటది.. వైరల్ అయిన వీడియో..

కర్ణాటకలో బైక్ పై స్టంట్లు చేస్తూ ఇద్దరు గాయాలపాలయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

|
Google Oneindia TeluguNews

చాలా మంది యువతకు బైక్ రైడింగ్ అంటే ఇష్టం ఉంటుంది. కొంత మంది యువకులు బైక్ లో స్టంట్లు చేస్తుంటారు. ఇలా స్టంట్లు చేస్తున్న క్రమంలో చాలా మంది ప్రమాదానికి గురి అయి చనిపోయిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఇద్దరు యువకులు బైక్ వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. ఇందుకు సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డివైడర్

డివైడర్

ఈ వీడియోలో చాలా మంది ద్విచక్ర వాహనాలపై వస్తున్నట్లు కనిపిస్తుంది. ఇందులో బుల్లెట్ బండిపై ఇద్దరు వేగంగా వస్తారు. వారు ఆ వేగంలో వాహనాన్ని తిప్ప లేక డివైడర్ ను ఢీకొట్టారు. దీంతో వారు బండిపై నుంచి కింద పడి గాయాల పాలయ్యారు. ఇదంతా ముందు బైక్ వెళ్తోన్న వ్యక్తి వీడియో తీశాడు. గాయపడిన వారి పరిస్థితి ఎలా తెలియరాలేదు.

విజయనగర్

విజయనగర్

ఈ ఘటన మంగళవారం కర్ణాటకలోని విజయనగర్ లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను ప్రజావాణి అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. లారీ, బస్సు వచ్చి ఉంటే బాగుండేదని.. ఇది వారి తప్పు కాదు తల్లిదండ్రుల తప్పని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు మంచి కెమెరామెన్ చాలా బాగా వీడియో తీశాడని మరొకరు కామెంట్ చేశారు.

వెనకాల కూర్చున్న వ్యక్తి

ఈ ప్రమాదంలో వెనకాల కూర్చున్న వ్యక్తి తీవ్ర గాయపడినట్లు తెలుస్తోందని ఇంకొకరు కామెంట్ చేశారు. కొద్ది రోజుల క్రితం హైవేపై ఒక యువకుడు తన బైక్‌ను అవసరమైన దానికంటే వేగంగా నడుపుతూ బైక్ ముందు భాగాన్ని గాలిలో లేపి.. కదులుతున్న బైక్‌పై విన్యాసాలు చేసి చూపించాడు. ఇలా చేసే క్రమంలో అదుపు తప్పి కిందపడిపోడి ప్రాణాలు కోల్పోయాడు.

English summary
Many youngsters love bike riding. Some youngsters do stunts on bikes. There are incidents where many people have met with accidents and died while performing such stunts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X