• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వీడియో: వరదల్లో సైన్యం సాహసం..దేవుడిలా వచ్చారంటూ జేజేలు పలుకుతున్న జనం

|

బెంగళూరు: దేవుడు ఎక్కడో ఉండడు. మనలోనే ఉంటాడు. అవసరానికి బయటికొస్తాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాడని పెద్దలు చెబుతుంటారు. అందుకే- దైవం మానుష్య రూపేణా అంటారు. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ విపత్తు నిర్వహణ దళాలు, సైనిక బలగాలు చేపట్టిన సహాయక చర్యలను బట్టి చూస్తోంటే..పెద్దలు చెప్పిన మాటలు నిజమేనని మరోసారి నిరూపితమౌతున్నాయి. ఒక్క రాష్ట్రం కాదు.. రెండు రాష్ట్రాలు కాదు.. దాదాపు దేశవ్యాప్తంగా 15కు పైగా రాష్ట్రాలు వరద పోటుకు గురయ్యాయి.

ఈశాన్యాన ఉన్న అసోం నుంచి పశ్చిమాన ఉన్న గుజరాత్ వరకు, ఉత్తరాన ఉన్న ఉత్తరాఖండ్ నుంచి దక్షిణాన ఉన్న కేరళ వరకూ అన్నీ వరద ముంపునకు గురైన రాష్ట్రాలే. ప్రత్యేకించి- మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్ వరద తాకిడికి గురయ్యాయి. పలువరు మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావానికి గురై ఒక్క కేరళలోనే 50మందికి పైగా మరణించారు. ఈ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లా విరిగి పడుతున్న కొండ చరియలు, మట్టి పెళ్లలతో కూరుకుపోయింది. ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బళ్లారి, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఏనాడూ భారీ వర్షాల ముఖమే చూడని బెళగావి జిల్లాను తాజాగా వరదలు ముంచెత్తుతున్నాయి.

ఇలాంటి స్థితిలో త్రివిధ దళాలు, జాతీయ విపత్తు నిర్వహక బలగాలు రంగంలోకి దిగాయి. మరణాల సంఖ్యను తగ్గించడానికి రేయింబవళ్లు కృషి చేస్తున్నాయి. శతృసైన్యం ఎలా కనికరం లేకుండా, దయాదాక్షిణ్యాలు చూపకుండా విరుచుకుపడే ఆర్మీ, నౌక, వాయు సేనకు చెందిన జవాన్లు..దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వరదల్లో చిక్కుకుపోయి, సహాయం కోసం ఎదురు చూస్తోన్న బాధితులను సకాలంలో ఆదుకుంటున్నారు. ఆపన్నహస్తాన్ని అందిస్తున్నారు. తాజాగా- వరద నీటిలో చిక్కుకుని పోయిన తన కుటుంబాన్ని కాపాడిన ఓ జవానుకు ఓ మహిళ పాద నమస్కారం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

A video on flood victim did Pada Namaskara to an Army soldier, who rescued her

ఆ మహిళ తన కుటుంబ సభ్యులతో సహా ఓ పడవలో ఎక్కి వెళ్తూ, తన పక్కనే నిల్చున్న ఓ ఆర్మీ జవాను పాదాలను భక్తితో పాద నమస్కారం చేశారు. ఆ సమయంలో ఆ జవాను ఆమెను ఓదార్చుతూ ధైర్యం చెబుతున్న ఈ వీడియో మన దేశ జవాన్లలోని మానవీయ కోణానికి అద్దం పడుతోంది. 45 సెకెన్ల పాటు ఉన్న ఈ వీడియో ఎక్కడిదనేది స్పష్టంగా తెలియరానప్పటికీ..కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి సంబంధించినట్లుగా తెలుస్తోంది. కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బెళగావి జిల్లా వరద బీభత్సానికి కకావికలమైన విషయం తెలిసిందే. ఈ జిల్లాలో వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం వారి కోసం సహాయ, పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Woman likely belong from Belagavi District in Karnataka, did Pada Namaskara to a Army soldier, who rescued her from the Floods. A Video went viral in Social Media. The most severely affected section in Karnataka is the Sakleshpur-Subramanya Road section. Tens of landslides have occurred in the last few days, and railway staff have been working on a war footing with earthmovers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more