వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

UGC NET Admit Cards:మరో వారం రోజుల్లో పరీక్ష...నో హాల్‌ టికెట్స్.. అభ్యర్థుల్లో టెన్షన్..!

|
Google Oneindia TeluguNews

మరో వారం రోజుల్లో యూజీసీ నెట్... నెట్‌కు అప్లయ్ చేసుకున్న అభ్యర్థుల్లో ఆందోళన. ఇదెందుకు అనుకుంటున్నారా..? ఇప్పటి వరకు పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌లో పొందుపర్చలేదు. దీంతో అభ్యర్థుల్లో ఒక్కింత టెన్షన్ నెలకొంది.

సెప్టెంబర్ 16వ తేదీన దేశవ్యాప్తంగా నెట్ పరీక్ష జరగనుంది. అయితే ఇప్పటి వరకు అధికారులు హాల్‌టికెట్లు అధికారిక వెబ్‌సైట్లో పొందుపర్చకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాదు దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన జారీ కాలేదు. పరీక్ష నిర్వహించే ఏజెన్సీ ప్రకారం రోల్‌నెంబర్, పరీక్షా సెంటర్, తేదీ, పరీక్షా సమయం సూచించే అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి పరీక్ష ప్రారంభానికి 15 రోజుల ముందు అడ్మిట్ కార్డులను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అడ్మిట్ కార్డులు పొందుపర్చకపోవడంతో అభ్యర్థుల్లో అసలు పరీక్ష జరుగుతుందా లేక వాయిదా పడుతుందా అనే కొత్త అనుమానాలు ప్రారంభమయ్యాయి.

 A week days to go for the UGC NET Exam and no Admit cards, Candidates under tension

సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు ఆ తర్వాత సెప్టెంబర్ 21 నుంచి 25వ తేదీ వరకు నెట్ పరీక్ష జరగాల్సి ఉంది. పేపర్ 1 మరియు పేపర్ -2లు ఉంటాయి. పేపర్ -1కు 100 మార్కులు ఉండగా పేపర్ -2కు 200 మార్కులు ఉంటాయి. రెండు సెషన్లలో నిర్వహించే పరీక్ష తొలి పేపర్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30కు ముగియనుండగా... రెండో పేపర్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:30 గంటలకు ముగుస్తుంది.

Recommended Video

#Watch Sai Pallavi @FMGE exam డాక్టర్ కానున్న హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి !

అంతకుముందు జూన్ 15 నుంచి జూన్ 20 వరకు జరగాల్సిన పరీక్షలు కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డాయి. అయితే ఈ సారి కోవిడ్-19 నిబంధనలకు లోబడే పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ఇందుకోసం కొన్ని గైడ్‌లైన్స్ కూడా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్శిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధిస్తారు. అంతేకాదు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు కూడా అర్హత సాధిస్తారు.

English summary
Candidates who applied for NET exam that is scheduled for Septmber 15th are worrying as the admit cards have not been put up by the National Testing Agency on its official website.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X