• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Cheating lover: కాపురం చేసి చేతులు ఎత్తేసిన ప్రియుడు, కులం తక్కువ, పట్టపగలు అరుంధతి నక్షత్రం !

|

చెన్నై/ మదురై/ కడలూరు: ఎంఏ చదువుకోవడానికి చెన్నై వచ్చిన రేవతి అనే యువతికి ప్రేమ పేరుతో విజయ్ హల్వా ఇచ్చాడు. విజయ్ ఇచ్చిన హల్వా తియ్యగా ఉందని రేవతి అతని మాయలో పడిపోయింది. రేవతిని రహస్యంగా పెళ్లి చేసుకున్న విజయ్ ఓ ఇంటిలో కాపురం పెట్టి చాలాకాలం పాటు ఎంజాయ్ చేశాడు. రేవతి మీద మోజు తీరిపోవడంతో నీ కులం తక్కువ, నిన్ను పెళ్లి చేసుకుని కాపురం చెయ్యడానికి ఈ సమాజం అంగీకరించదు అంటూ విజయ్ భారీ సినిమా డైలాగులు చెప్పాడు. పోలీసులు సైతం విజయ్ కి వత్తాసు పలకడంతో రగలిపోయిన రేవతి పట్టపగలు ప్రియుడు విజయ్ తో పాటు పోలీసు అధికారులకు అరుంధతి నక్షత్రం చూపింది.

TikTok: డబుల్ బెడ్ రూమ్ హౌస్, తల్లి టీ 20, కూతురు వన్ 'డే'మ్యాచ్ లు, ఇంట్లోనే లవర్స్, చివరికి !TikTok: డబుల్ బెడ్ రూమ్ హౌస్, తల్లి టీ 20, కూతురు వన్ 'డే'మ్యాచ్ లు, ఇంట్లోనే లవర్స్, చివరికి !

 రేవతి ఎంఏ

రేవతి ఎంఏ

తమిళనాడులోని కడలూరు జిల్లా దిండివనం ప్రాంతానికి చెందిన చెందిన గౌతమి (29) అనే యువతి చెన్నై చేరుకుని వెస్ట్ కర్జన్ రోడ్డులో నివాసం ఉంటూ ఎంఏ పూర్తి చేసింది. గౌతమితో పాటు ఆమె తల్లి, సోదరుడు చెన్నై వచ్చి ఇంతకాలం ఉన్నారు. ఎంఏ పూర్తి చేసిన గౌతమి చెన్నైలోని ప్రముఖ కంపోనీలో ఉద్యోగం చేస్తున్నది. రేవతికి మంచి ఉద్యోగం రావడంతో ఆమె తల్లి, సోదరుడు సొంత ఊరు అయిన దిండివనం వెళ్లిపోయారు.

 విజయ్ ఇంటర్ ఫెయిల్

విజయ్ ఇంటర్ ఫెయిల్

చెన్నైలోని తిరుమంగళం ప్రాంతంలో నివాసం ఉంటున్న విజయ్ (29) అనే యువకుడు వాటర్ క్యాన్ లు సరఫరా చేస్తున్నాడు. వాటర్ క్యాన్ లు సరఫరా చేసే సమయంలో రేవతికి విజయ్ పరిచయం అయ్యాడు. ఉద్యోగానికి వెళ్లి వచ్చే సమయంలో విజయ్ అతని బైక్ లో రేవతిని డ్రాప్ చేస్తున్నాడు. విజయ్ ఇంటర్ వరకు చదివి ఫెయిల్ అయ్యాడు. చదువు అనే కష్టాన్ని భరించలేక విజయ్ ఇంటర్ తోనే చదువుల తల్లిని దూరం పెట్టాడు.

 హల్వా ఫేమస్ తింటావా !

హల్వా ఫేమస్ తింటావా !

తన బైక్ లో తిరుగుతున్న రేవతికి ఓ రోజు విజయ్ హల్వా ఇచ్చాడు. ఈ హల్వా చాలా ఫేమస్ అని, నువ్వు తినాలని రేవతిని బలవంతం చేశాడు. హల్వా చాలా తియ్యగా ఉందని, విజయ్ మాటలు ఇంకా తియ్యగా ఉన్నాయని రేవతి అతని మాయలో పడిపోయింది. అంతే నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన విజయ్ రేవతి ఇంటికి వెళ్లి వచ్చేవాడు.

 అమ్మానాన్న ఆటతో మస్త్ మజా

అమ్మానాన్న ఆటతో మస్త్ మజా

రేవతిని పూర్తిగా నమ్మించిన విజయ్ ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఒంటరిగా ఉంటున్న రేవతితో ప్రతిరోజు అమ్మానాన్న ఆట ఆడుకున్న విజయ్ అతని కామవాంఛ తీర్చుకున్నాడు. చుట్టుపక్కల వాళ్లు కూడా విజయ్, రేవతి పెళ్లి చేసుకుని కాపురం ఉంటున్నారు అనే విధంగా ఇద్దరు కలిసిమెలసి ఇంతకాలం తిరిగారు.

 కులం తక్కువ... సమాజం ఒప్పుకోదు

కులం తక్కువ... సమాజం ఒప్పుకోదు

తన కుటుంబ సభ్యులకు చెప్పి అందరికి తెలిసేలా పెళ్లి చేసుకుందామని ఇటీవల రేవతి విజయ్ మీద ఒత్తిడి చేసింది. ఓరినాయనో ఈ వ్యవహారం ఎక్కడికోపోయి ఎక్కడికో వచ్చేటట్లు ఉందని ఆందోళన చెందిన విజయ్ నీ కులం తక్కువ, నా కులం ఎక్కువ, మనం పెళ్లి చేసుకుని కాపురం చెయ్యడానికి ఈ సమాజం అంగీకరించదని, మా ఇంట్లో అసలు ఒప్పుకోరని భారీ సినిమా డైలాగులు చెప్పి పెళ్లి చేసుకోను అంటూ ఎదురుతిరిగాడు. రానురాను రేవతిని కలవడం, చివరికి మాట్లాడటం వదిలేసిన విజయ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడు.

 అప్పుడు లేని అర్జెంట్ ఇప్పుడు వచ్చిందా ?

అప్పుడు లేని అర్జెంట్ ఇప్పుడు వచ్చిందా ?

విజయ్ తనను మోసం చేశాడని, రహస్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు వేరే అమ్మాయిని మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడని రేవతి చెన్నైలోని తిరుమంగళం మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. అయితే రేవతి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విజయ్ ని అరెస్టు చెయ్యలేదు. కనీసం విచారణ కూడా చెయ్యలేదని రేవతి ఆరోపిస్తున్నది. సార్ న్యాయం చెయ్యండి అని రేవతి పోలీసులను వేడుకుంటే చూడమ్మా అతనితో కలిసి తిరిగినప్పుడు లేని తొందర ఇప్పుడు అతన్ని అరెస్టు చెయ్యాలని ఎందుకు తొందర చేస్తున్నావు అంటూ నిర్లక్షంగా సమాధానం ఇచ్చారు. విజయ్ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులు అతనికే వత్తాసు పలికారని రేవతి ఆరోపించింది.

 పట్టపగలు అరుంధతి నక్షత్రం చూపించిన రేవతి

పట్టపగలు అరుంధతి నక్షత్రం చూపించిన రేవతి

తనకు జరిగిన అన్యాయం డెమొక్రాటిక్ మాథర్ మహిళా సంఘం సభ్యులకు చెప్పిన రేవతి వారిని వెంటపెట్టుకుని నేరుగా తిరుమంగళం మహిళా పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు కుర్చుంది. పోలీసులు ఎంత నచ్చచెప్పినా రేవతి మాత్రం ధర్నా విరమించలేదు. నాలుగు గంటల పాటు పోలీస్ స్టేషన్ ముందు రేవతి, మహిళా సంఘాలు ధర్నా చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయ్ దగ్గర మామూళ్లు తీసుకుని అతన్ని అరెస్టు చెయ్యకుండా వదిలేశారని రేవతి, మహిళా సంఘాలు ఆరోపించాయి. పట్టపగలు రేవతి పోలీసులకు అరుంధతి నక్షత్రం చూపించింది. విషయం తెలుసుకున్న తిరుమంగళం అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్, ఇన్స్ పెక్టర్ రవి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని విజయ్ ని అరెస్టు చేస్తామని రేవతి, మహిళా సంఘాలకు నచ్చచెప్పారు. పోలీసు అధికారులు హామీ ఇవ్వడంతో రేవతి ధర్నా విరమించింది. రేవతి రచ్చరచ్చ చెయ్యడంతో విజయ్ మాయం అయ్యాడు.

English summary
Cheating lover: A woman did sit in agitation in Chennai Thirumangalam police station citing police not taking action on her complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X