ఫ్రెండ్ భర్తతో అక్రమ సంబంధం, బెడ్ రూంలో రెడ్ హ్యాడెండ్ గా చిక్కారు. కత్తితో చీల్చేసింది !
చెన్నై: స్నేహితురాలి ఇంటికి వెలుతున్న వగలాడి ఆమె భర్తను వలలో వేసుకుని వారి బెడ్ రూంలోనే ఎంజాయ్ చేసింది. విషయం కాస్తా స్నేహితురాలికి తెలియడంతో ఆమె అక్రమ సంబంధం బయటపడింది. నా ఇంటికి వస్తూ తన కాపురాన్నే నాశనం చెయ్యాలని చూస్తున్నావా ? అంటూ స్నేహితురాలు ఆమెను నిలదీసింది. తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్న స్నేహితురాలిని చంపేయాలని కిలాడీ లేడి నిర్ణయించింది. అనుకున్నట్లే స్నేహితురాలి గొంతు చీల్చి ఆమెను చంపేయాలని ప్రయత్నించి చివరి జైలుకు చేరిన ఘటన తమిళనాడులోని చెన్నై నగరంలో జరిగింది.
ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!
మంచి స్నేహితులు
చెన్నై నగరంలోని కొడుంగైయూర్ ప్రాంతంలో మునియమ్మాల్ అనే మహిళ భర్త కార్తీక్ తో కలిసి నివాసం ఉంటోంది. చెన్నైలోని నుంగంబాక్కంలో ప్రియా అనే మహిళ నివాసం ఉంటున్నది. మునియమ్మాల్, ప్రియా మంచి స్నేహితులు. అప్పుడప్పుడు ప్రియా కొడుంగైయూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మునియమ్మాల్ ఇంటికి వచ్చి వెళ్లేది.
స్నేహితురాలి భర్తపై కన్నుపడింది
మునియమ్మాల్ భర్త కార్తీక్ తో ప్రియాకు పరిచయం అయ్యింది. మునియమ్మాల్ ఇంటికి వచ్చివెళ్లే ప్రియాకు ఆమె భర్త కార్తీక్ మీద కన్నుపడింది. మునియమ్మాలతో మాట్లాడుతున్నట్లు నటించే ప్రియా చిన్నగా కార్తీక్ ను ముగ్గులోకి దింపింది. కార్తీ సైతం తన భార్య మునియమ్మాల్ స్నేహితురాలు ప్రియాతో చనువుగా ఉంటున్నాడు.
ఫ్రెండ్ భర్తతో ఎంజాయ్
మునియమ్మాల్ ఎప్పుడు ఇంటిలో ఉంటుంది, ఎప్పుడు బయటకు వెలుతుంది అనే విషయాలు ఆమె స్నేహితురాలు ప్రియా ఎప్పటికప్పుడు తెలుసుకునేది. తరువాత మునియమ్మాల్ లేని సమయంలో ఆమె ఇంటికి వెలుతున్న ప్రియా కార్తీక్ తో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. కార్తీక్ సైతం ఇంటికి వస్తున్న భార్య స్నేహితురాలు ప్రియాతో ఇంటిలోనే అక్రమ సంబంధం సాగించాడు.
రెడ్ హ్యాడెండ్ గా బెడ్ రూంలో !
కొంత కాలం క్రితం మునియమ్మాల్ పనిపై ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ సమయంలో ప్రియా మునియమ్మాల్ ఇంటికి వెళ్లి ఆమె భర్త కార్తీక్ తో ఏకంగా బెడ్ రూంలో రాసలీలలు సాగించింది. పనిపై బయటకు వెళ్లిన మునియమ్మాల్ పని మద్యలో ముగించుకుని ఇంటికి వచ్చింది. ఇంటిలో బెడ్ రూంలో భర్త కార్తీక్, స్నేహితురాలు ప్రియాను నగ్నంగా చూసిన మునియమ్మాల్ షాక్ కు గురైయ్యింది.
ఇద్దరికీ వార్నింగ్
భర్త కార్తీక్, స్నేహితురాలు ప్రియా అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న మునియమ్మాల్ రగిలిపోయింది. ఇక ముందు ఇలా చేస్తే మీ అంతుచూస్తానని, తన గురించి మీకు పూర్తిగా తెలీదని మునియమ్మాల్ భర్త కార్తీక్, స్నేహితురాలు ప్రియాను తీవ్రస్థాయిలో హెచ్చరింది. ఇక ముందు ఇద్దరు కలుసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని మునియమ్మాల్ హెచ్చరించింది.
భార్య రాక్షసి అని తెలుసు
తన భార్య మునియమ్మాల్ రాక్షసి అని ముందుగానే తెలుసుకున్న కార్తీక్ తన ప్రియురాలు ప్రియాకు దూరం కావాలని నిర్ణయించాడు. ప్రియురాలు ప్రియాను కలిస్తే తన పని అయిపోతుందని భయంతో కార్తీక్ ఆమెను దూరం పెట్టాడు. కార్తీక్ తో తన అక్రమ సంబంధానికి అతని భార్య మునియమ్మాల్ అడ్డు వస్తోందని, ఆమెను అంతం చెయ్యాలని ప్రియా నిర్ణయించింది.
భర్త ముందే స్నేహితురాలి గొంతు చీల్చింది
మునియమ్మాల్ ను హత్య చెయ్యాలని సమయం కోసం ప్రియా వేచి చూసింది. రాత్రి కార్తీక్ అతని భార్య మునియమ్మాల్ ఊరికి వెళ్లడానికి కోయంబత్తూరు బస్ స్టాండ్ దగ్గరకు వెళ్లి బస్సు కోసం వేచిచూస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రియా నేరుగా బస్ స్టాండ్ చేరుకుని మునియమ్మాల్ తో గొడవ పెట్టుకుంది. మునియమ్మాల్, ప్రియాల మధ్య అక్రమ సంబంధం విషయంలో తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో పక్కాప్లాన్ తో అక్కడికి వెళ్లిన ప్రియా బ్యాగ్ లోని కత్తి తీసుకుని మునియమ్మాల్ పై దాడి చేసి ఆమె గొంతు చీల్చి హత్య చెయ్యడానికి ప్రయత్నించింది. పక్కనే ఉన్న కార్తీక్, అక్కడి ప్రయాణికులు ప్రియాను అడ్డుకుని మునియమ్మాల్ ను కిలపాక్కం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రియాను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.