వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నకిలీ స్విగ్గి కాల్‌సెంటర్‌తో రూ.100000 మోస పోయిన మహిళ

|
Google Oneindia TeluguNews

సైబర్ నేరాగాళ్ల మాయలో పడి బెంగళూరుకు చెందిన ఓ మహిళ తన బ్యాంకు ఖాతా నుండి సుమారు లక్ష రూపాయలను పొగొట్టుకుంది. ఇటివల సైబర్ నేరగాళ్లు ఎస్సీఈవోను కూడ వాడుకుని తమ నెంబర్లను ఆయా కంపనీల పేరుతో నమోదు చేసుకుని మోసం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాము చేస్తుంది అసలు కంపనీకా లేక ఇతర కంపనీకా తెలియని గందరగోళంలో కొంతమంది వినియోగాదారులు మోస పోతున్నారు.

ఈ నేపథ్యంలోనే బెంగళూరుకు చెందిన అపర్ణ అనే మహిళ ఇటివల స్విగ్గి ప్రారంభించిన గో స్విగ్గి కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి మోసపోయింది. గో స్విగ్గి ద్వార ఆర్డర్ చేసిన వస్తువు ఇతర అడ్రస్‌కు చేరడంతో గోస్విగ్గి కాల్ సెంటర్‌ను అశ్రయించింది. కాల్ సెంటర్ నెంబర్ కోసం గూగుల్ సెర్చ్‌లో ఓ నెంబర్‌ను వెతికింది. ఆ నంబర్‌కు ఫోన్ చేసి సమస్యను వివరించింది. అయితే ఆమే చేసిన నంబర్ సైబర్ నేరాగాళ్లకు చేరడంతో వారి ఉచ్చులో పడిపోయింది.

 A woman has lost around Rs 1 lakh from her bank account by fake swiggy call center.

కాల్ రీసివ్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అయితే ఇందుకు సంబంధించి మరో వస్తువు కొనుగోలు చేయాలని నిబంధన విధించారు. వారి మాటలను నమ్మిన మహిళ వారు పంపిణ లింకును పంపారు. అందులో బ్యాంకు వివరాలతో పాటు యూపిఐ పిన్ నంబర్ సైతం తెలపడంతో సైబర్ నేరాగాళ్ల పంటపండింది. ఆమే పంపిణ వివరాలతో ఖాతాలో ఉన్న తొంబై అయిదు వేల రూపాయలను ఆమే ఖాతా నుండి కొట్టి వేశారు. ఖాతా నుండి డబ్బులు డెబిట్ అయిన వెంటనే ఆమే ఫోన్ నంబర్‌కు మెసెజ్ రావడంతో అలర్ట్ అయిన మహిళ అంతకుముందు చేసిన ఫోన్ నంబర్‌కు కాల్ చేసింది. అయితే నంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో ఖంగుతిన్న మహిళ పోలీసులను ఆశ్రయించింది. ముఖ్యంగా స్విగ్గి లాంటీ ప్రముఖ సంస్థ కావడంతోనే వారి మాటలు నమ్మి బ్యాంకు ఖాతా వివరాలు చెప్పానని తెలిపింది.

English summary
A Bangalore-based woman has lost around Rs 1 lakh from her bank account by fake swiggy call center.Woman serched go swiggy call center in google. and got fake call center number.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X