వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళ ఖైదిపై పోలీస్ అత్యాచారం...! ట్రైయిన్ టాయిలెట్‌‌లోనే అఘాయిత్యానికి పాల్పడ్డ కానిస్టేబుల్

|
Google Oneindia TeluguNews

ఖైదీల్లో పరివర్తన తేవాల్సిన ఓ కానిస్టేబులే జైలులో ఖైదీగా మారేందుకు సిద్దమయ్యాడు. మహిళ ఖైదీ అని కూడ చూడకుండా ఆమేపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే అది కూడ రైళ్లోని టాయిలెట్‌లో అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం జైల్లో ఎవ్వరికి చెప్పద్దని బెదిరించాడు. అయితే ఖైది సంబంధిత అధికారులకు పిర్యాధు చేయడంతో విషయం బయటకు వచ్చింది.

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందిలో మార్పు కనిపించడం లేదు. దీంతో విధుల్లో ఉండి కూడ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈనేపథ్యంలోనే తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న మహిళ ఖైదిపై అత్యాచారం చేశాడు. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళ ఖైదిని విచారణ నిమిత్తం ట్రైన్‌లో పశ్చిమ బెంగాల్ కోర్టుకు తీసుకెళ్లారు. అయితే విచారణ పూర్తి అయిన అనంతరం ఖైదీని తీసుకుని ట్రైయిన్‌లో బయలు దేరారు. కాగా మహిళ కానిస్టేబుల్ వెంట ఇద్దరు మహిళ పోలీసులతోపాటు ఒక పురుష కానిస్టేబుల్ ఎస్కార్ట్స్‌గా వెళ్లారు.

A woman prisoner was raped in the toilet of a moving train

ఇక ట్రైయిన్‌లో తిరుగు ప్రయాణంలో మహిళ ఖైది టాయిలెట్‌కు వెళ్లింది. దీంతో ఆమే వెంట మరో మహిళ కానిస్టేబుల్ కూడ వెంట వెళ్లింది. దీంతో టాయిలెట్ వద్దకు చేరుకున్న పురష కానిస్టేబుల్ అక్కడ ఉన్న మహిళ కానిస్టేబుల్‌ను అక్కడ నుండి వెళ్లిపోమ్మని చెప్పాడు. అనంతరం ఒంటరిగా ఉన్నమహిళ ఖైదిపై బలవంతంగా అత్యాచారం చేశాడు.అనంతరం ఎవ్వరికి చెప్పవద్దని బెదిరించాడు.

అయితే తిహార్ జైలుకు వెళ్లిన తర్వాత విషయాన్ని అక్కడి వైద్యులతోపాటు జైలు సూపరిండెంట్‌కు పిర్యాధు చేసింది. దీంతో సదరు కానిస్టేబుల్ పై హరినగర్ పోలీసు స్టేషన్‌లో కేసును నమోదు చేశారు. అనంతరం మహిళ ఖైదికి పరీక్షలు నిర్వహించారు. కాగా వైద్య పరీక్షల్లో ఆమే అత్యాచారానికి గురైనట్టు వైద్యులు గుర్తించారు.కాగా ఈ సంఘటన ఆగస్టు మూడున జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

English summary
A woman prisoner taken to West Bengal for a court hearing earlier this month was raped in the toilet of a moving train by a Delhi Police constable.who was part of the team escorting her, according to a complaint filed at the New Delhi Railway Station police station on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X